భరత్ ప్రీ రిలీజ్ లో ప్రకాష్ రాజ్ ఫీల్ అయ్యాడు

maheshbabu next movie story

నిన్న జరిగిన భరత్ అనే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ ముఖ్య అథితిగా రావడం.. మహేష్ బాబుతో తారక్ స్టేజి షేర్ చేసుకోటం…తారక్ మహేష్ ను అన్న అని సంబోధించటంతో పాటు మహేష్ గురించి తారక్ గొప్పగా మాట్లాడటం హాట్ టాపిక్ అయింది. అయితే నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా కూల్ గా సాగింది కానీ.. ప్రకాష్ రాజ్ మనస్తాపం చెంది అర్ధంతరంగా తన ప్రసంగాన్ని ఆపేసి స్టేజి దిగి వెళ్ళిపోటం హాట్ టాపిక్ గా మారింది.

ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన యల్. బీ స్టేడియం లో మహేష్ ఫ్యాన్స్ తో పాటు తారక్ ఫ్యాన్స్ కూడా వచ్చి సందడి చేసారు. అయితే ముఖ్య అథితిగా వచ్చిన సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ సినిమా గురించి మాట్లాడుతుండగా మధ్యలో కొంత మంది ప్రేక్షకులు తనను ఉద్దెశించి ‘ఫాదర్ ఫాదర్’ అంటూ నినాదాలు చేసారు. ఆయన తన ప్రసంగం ఆపేసి నవ్వుతూనే ఏంటి ఏంటి అని ఆ నినాదాలు చేసిన వాళ్ల వైపు చూశారు. మళ్లీ తన స్పీచ్ స్టార్ట్ చేయగానే మళ్లీ ‘ఫాదర్ ఫాదర్’ అని ఆరిసారు. పక్కనే ఉన్నవారు ప్రకాష్ రాజ్ కు విషయం చెప్పారు. అంతే.. ఆయన హఠాత్తుగా తన ప్రసంగాన్ని ఆపేసి వేదిక దిగిపోయారు. అక్కడున్న సుమ కవర్ చేయటానికి ట్రై చేసిన ఉపయోగం లేకుండా పోయింది.

ఇలాంటి వేడుకల్లో వేదిక మీద వక్తలు మాట్లాడుతున్నపుడు అభిమానులు ఏవో నినాదాలు చేయడం మామూలే. చిరంజీవి లాంటి టాప్ హీరోకే ఇటువంటివి తప్పలేదు. చిరంజీవి మాట్లాడుతుంటే పవర్ స్టార్ పవర్ స్టార్ అంటూ ఎన్నిసార్లు అరవలేదు. అయినా ఆయన సంయమనం పాటించారు. దానితో పోలుచుకుంటే ‘ఫాదర్ ఫాదర్’ అనడం పెద్ద విషయం కాదు. ఎక్కువ సినిమాల్లో ప్రకాష్ రాజ్ ఫాదర్ పాత్రల్లో కనిపించారు కాబట్టి వాళ్లు అలా అన్నారేమో. అంతమంది జనాలు ఉన్నప్పుడు ఇవి కామన్ అని వదిలేయాలి తప్ప దానికి కూడా ఫీల్ అవ్వాలా?

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*