స్టార్టయిన్నట్లే

పూరి జగన్నాథ్

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో ఓ సినిమా ప్రారంభం కానుంది. రీసెంట్‌గా విడుదలైన `ఇస్మార్ట్ శంకర్`తో బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు పూరి జగన్నాథ్. ఈ చిత్రం ఇంకా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇలాంటి తరుణంలో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందబోయే చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి, చార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే సినిమాలో ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటిస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: పూరి జగన్నాథ్, సమర్పణ: లావణ్య, నిర్మాతలు: పూరి జగన్నాథ్, చార్మి కౌర్, బ్యానర్స్: పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్.

Ravi Batchali
About Ravi Batchali 18027 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*