రాహుల్ రవీంద్రన్ భలే ఛాన్స్ కొట్టేశాడుగా..!

Rahul Ravindran

‘దేవదాస్’ యావరేజ్ హిట్ తరువాత కింగ్ నాగార్జున తన నెక్స్ట్ మూవీపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం నాగ్ హిందీలో ఓ సినిమా.. తమిళంలో ధనుష్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. కానీ తెలుగులో మాత్రం తన నెక్స్ట్ మూవీ ఏంటో చెప్పలేదు. కానీ నాగార్జున కోసం రెండు స్క్రిప్ట్స్ రెడీగా ఉన్నాయట. అందులో ఒకటి ఎప్పటి నుంచో వార్తల్లో వున్న బంగార్రాజు. ప్రస్తుతం ఈ స్క్రిప్ట్ ను రెడీ చేసే పనిలో ఉన్నాడు డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ. లైన్ విని ఓకే చేసిన నాగ్ ఫుల్ స్క్రిప్ట్ త్వరలోనే విని ఓకే చేయనున్నాడు. ప్రస్తుతం ఆ లైన్ కు అనుగుణంగా బౌండ్ స్క్రిప్ట్ తయారుచేసే పనిలో ఉన్నాడు కళ్యాణ్ కృష్ణ.

అడ్వాన్స్ తీసుకున్న రాహుల్…

ఇంకా రెండో స్క్రిప్ట్…’చి.ల.సౌ’ సినిమాతో సక్సెస్ ను అందుకున్న నటుడు కమ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ నాగ్ ని పెట్టి ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. సినిమాకు సంబంధించి రాహుల్ అన్నపూర్ణలో అడ్వాన్స్ అందుకున్నారు. రాహుల్ చెప్పిన లైన్ కు ఇంప్రెస్స్ అయినా నాగ్ బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పాడట. ప్రస్తుతం ఆ పనుల్లో ఉన్నాడు రాహుల్. ఈ రెండు స్క్రిప్ట్స్ లో ఎవరిది ఫస్ట్ రెడీ అయితే వారితో సినిమా చేయనున్నాడు నాగ్.

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*