తారక్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

ఎన్టీఆర్ Junior NTR రామాయణ

సినిమా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మరో నెలలో స్టార్ట్ అవుతుంది అంటున్నారు కానీ క్లారిటీ లేదు. అయినా కానీ #RRR సినిమాపై రోజుకో అప్ డేట్. రామ్ చరణ్..ఎన్టీఆర్ హీరోస్ కావడం..రాజమౌళి దర్శకుడు కావడంతో ఈసినిమాపై తెలుగు సినీపరిశ్రమే కాకుండా, ఇతర సినీపరిశ్రమలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.

ప్రస్తుతం ఈసినిమాకు సంబంధించి హైదరాబాద్ లో అల్యూమియం ఫ్యాక్టరీలో భారీ ఎత్తున సెట్ వేస్తున్నారు. గత కొన్ని రోజులు నుండి ఈసినిమాలో తారక్ లుక్ గురించే డిస్కషన్ జరుగుతున్నాయి. రాజమౌళి..తారక్ ను సరికొత్త లుక్ లో చూపించబోతున్నాడట. అందులో భాగంగానే రాజమౌళి, ట్రైనర్ స్టీవ్స్‌ లాయిడ్‌ తో డిస్కస్ చేసినట్టు తెలుస్తోంది. రీసెంట్ గా స్టీవ్స్‌ లాయిడ్‌ తన ట్విట్టర్ ఖాతాలో తారక్ లుక్ షాకింగ్ గా ఉంటుందని వెల్లడించడంతో అసలు తారక్ లుక్ ఎలా ఉండబోతుంది అని ఇప్పటి నుండే ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు.

ఎన్టీఆర్ తన లుక్ కోసం నాలుగైదు నెలల పాటు కఠినమైన బాడీ ట్రైనింగ్‌ తీసుకోనున్నారు. ట్రైనర్ స్టీవ్స్‌ లాయిడ్‌ చెప్పిన సూచనల మేరకే ఈ ట్రైనింగ్ ఉంటుందని తెలుస్తుంది. మొత్తం మీద ఎన్టీఆర్‌ ఈ సినిమాలో పూర్తి కండలు తిరిగిన దేహంతో కనిపించనున్నారు. ఇక ఈచిత్రంలో డైలాగ్స్ కోసం ప్రముఖ మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా ను తీసుకున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈచిత్రంను డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*