2.0 మూవీ సెన్సార్ టాక్

2.0 collections telugu cinema news

రజినీకాంత్ – శంకర్ కాంబోలో వస్తున్నా 2.0 సినిమా రికార్డులను కొల్లగొట్టడానికి రెడీ అయ్యింది. మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈసినిమాతో శంకర్ – రజిని లు కలిసి అద్భుతాలు చేస్తారని ప్రేక్షకులు ఆశపడుతున్నారు. 600 కోట్లతో నిర్మించిన ఈసినిమా అప్పుడే 370 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ తోనూ, శాటిలైట్స్, డిజిటల్ హక్కులతోను వెనక్కి తెచ్చేసింది. ఇకపోతే 2.0 సినిమాకి సెన్సార్ వారు యు/ఏ సర్టిఫికెట్ ని జారీ చెయ్యడమే కాదు.. సెన్సార్ సభ్యులు ఈ సినిమా విషయంలో అదుర్స్ అనే రేంజ్ లో మాట్లాడుతున్నారు కూడా.

సెన్సార్ టాక్ ప్రకారం 2.0 సినిమా 2 గంటల 29 నిమిషాలు నిడివి కలిగి ఉండడంతో పాటుగా సినిమాలో విజువ‌ల్ వండ‌ర్స్ అద్భుతంగా ఆకట్టుకుంటాయని… హీరో ర‌జినీకాంత్ విలన్ అక్ష‌య్ కుమార్ పాత్ర‌ల డిజైనింగ్ ప‌ర్‌ఫెక్ట్‌గా సెట్ అవడమే కాదు… వారిద్దరి మధ్య వచ్చే స‌న్నివేశాలు వావ్ అనేలా ఉన్నాయ‌ని చెబుతున్నారు. అలాగే 2.0 ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే మరింతగా ఆకట్టుకుంటుందని.. అలాగే ప్రీ క్లైమాక్స్, అలాగే క్లైమాక్స్ అన్ని సూపర్బ్ అంటున్నారు. రజినీకాంత్ యాక్షన్, అక్షయ కుమార్ యాక్షన్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయట.

మరి సినిమాలో గ్రాఫిక్స్ తోపాటులాగా 2.0 కథ, కథనం పర్ఫెక్ట్ గా కుదరయంటున్నారు. ఇక కథకు తగ్గ బ్యాగ్రౌండ్ స్కోర్ ఉందని.. ఏ ఆర్ రెహ్మాన్ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా చాలాబావుందని సెన్సార్ టాక్. మరి సెన్సార్ టాక్ ఇంత పాజిటివ్ గా ఉంటె… సినిమా హిట్టే అంటున్నారు. మరి భారీ బడ్జెట్ తో వస్తున్నా ఈ చిత్రం భారీగానే వసూళ్లు రాబడుతుందనిపిస్తుంది. చూద్దాం ఈ నెల 29 న ఏ విషయము తెలిసిపోతుంది

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*