రకుల్ హాట్ సాంగ్ కి డాన్స్ చేస్తే ?

రకుల్ ప్రీత్

టాలీవుడ్ లో ఆమ్మో ఎక్సపోజింగ్ గా అంటూ ఆమడ దూరం లో ఉండే రకుల్ ప్రీత్ సింగ్ తన సొంత బాష అయినా హిందీలో మాత్రం రెచ్చిపోతుంది. అక్కడ క్లీవేజ్ షోలతో విరుచుకుపడుతోంది. రీసెంట్ గా ఈ అమ్మడు నటించిన `మర్జావాన్` లో ఓ ఐటెం సాంగ్ చేసి అందరి కళ్లు ఆమెవైపు తిప్పుకునేలా చేసింది.

నవంబర్ లో రిలీజ్ అవుతున్న ఈసినిమాలో సిద్ధార్థ్ మల్హోత్రా ఓ రఫ్ అండ్ ఠఫ్ మాస్ పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో ఓ ఐటెం సాంగ్ లో రకుల్ చెలరేగిపోయింది. లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ఈ వీడియో సాంగ్ వైరల్ అవుతుంది. తనిష్క్ బాగ్చి అందించిన ఈ పాటను తులసీ కుమార్ పాడారు. రకుల్ అందాలని హైలైట్ చేస్తూ ఈ పాట ని చిత్రీకరించారు.

ఆమె అందాల్ని ఎలివేట్ చేసే బ్లౌజ్.. ఒంటిపై నిలవనంటున్న డిజైనర్ శారీలో అమ్మడి అందచందాల ట్రీట్ ఓ రేంజులోనే ఉంది. డాన్స్ అయితే వేసింది కానీ అనుభవ లేమి స్పష్టంగా ఫేసియల్ ఎక్స్ ప్రెషన్స్ లో తెలిసిపోతోంది. నాటుగా ఎక్స్ప్రెషన్స్ పెట్టలేకపోయింది. దాంతో పాట తేలిపోయింది. ఐటెం నంబర్స్ అనుభవం లేదు కాబట్టి రకుల్ ఇలా చేసింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*