రకుల్ ప్రీత్ సింగ్ క్రష్ ఎవరో తెలుసా?

రకుల్ ప్రీత్ సింగ్ మన్మథుడు 2

సన్నగా చీపిరి పుల్లలా మారిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం టాలీవుడ్ లో చెప్పుకోవడానికి పెద్దగా సినిమాలు ఏమి చేయడంలేదు. ఒకప్పుడు స్టార్ హీరోస్ తో ఆడి పాడిన ఈ పంజాబీ ముద్దుగుమ్మ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో తనకు విజయ్ దేవరకొండ అంటే చాలా ఇష్టం అని చెప్పింది.

మంచు లక్ష్మి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న’ఫీట్ అప్ విత్ ది స్టార్స్’ కార్యక్రమంలో రకుల్ పాల్గొంది. ఈ సందర్భంగా లక్ష్మి…. “నీకు సినీ సెలబ్రిటీల్లో ఎవరిపైనైనా క్రష్ ఉందా?” అని ప్రశ్నించింది. దానికి సమాధానం గా రకుల్ “బాలీవుడ్ లో రణ్ వీర్ సింగ్, టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ అంటే ఇష్టమని” తెలిపింది.

వీరిద్దరూ కాంబినేషన్ లో సినిమా రాలేదు. ఒకవేళ విజయ్ తో కలిసి నటించే ఛాన్స్ వస్తే ఎగిరి గంతేసేదేమో…ఈమె చేతిలో ప్రస్తుతం సినిమాలు ఏమి లేవు ఒక్క ‘భారతీయుడు 2’ తప్ప. ఒక్కసారిగా ఈమె కెరీర్ డ్రాప్ అవ్వడానికి కారణం ఆమె మరీ సన్నగా అవ్వడమే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*