తెలివైన రకుల్… రణవీర్ ని బుట్టలో వేస్తుందా..?

rakul preet singh

తెలుగులో ఆఫర్స్ లేని రకుల్. కోలీవుడ్ అవకాశాలు కోల్పోతున్న రకుల్. ఇలా రకుల్ ప్రీత్ సింగ్ మీద గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. కానీ రకుల్ ప్రీత్ మాత్రం కూల్ గా బాలీవుడ్ మీద కన్నేసింది. అక్కడ అజయ్ దేవగన్ తో కలిసి నటించిన దే దే ప్యార్ దే మిక్స్డ్ టాక్ తో సూపర్ హిట్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. మరి అందులో 50 ఏళ్ల అజెయ్ దేవగన్ కి రకుల్ ప్రీత్ లవర్ గా నటించింది. రకుల్ కి దే దే ప్యార్ దే కలెక్షన్స్ చూసి హ్యాపీ మోడ్ లోకి వెళ్లిపోయింది. అందుకే ఆ ఉత్సాహంతో దే దే ప్యార్ దే ప్రమోషన్స్ ని సోషల్ మీడియాలో పీక్స్ లో చేస్తుంది. ఇక బాలీవుడ్ లో దే దే ప్యార్ దే కి వస్తున్న రెస్పాన్స్ చూసిన రకుల్ పలు ఛానల్స్ కి ఇంటర్వ్యూ లు ఇస్తూ బిజీ బిజీగా మారిపోయింది.

రణవీర్ నే పెళ్లాడేదాన్ని…

ఆ ఇంటర్వూస్ లో భాగంగా రకుల్ కి బాలీవుడ్ హీరోల్లో ఇష్టమైన హీరో ఎవరనే ప్రస్తావన రాగానే రకుల్ ఏమాత్రం తడుముకోకుండా రణవీర్ సింగ్ పేరు చెప్పేసింది. బాలీవుడ్ లో ఎనర్జీ లెవెల్స్ పీక్స్ లో ఉంటాయని… అలాంటి హీరో బాలీవుడ్ లో మరొకరు లేరని.. ఆయనతో కలిసి పని చెయ్యడం ఒక అదృష్టమని.. అసలు రణవీర్ సింగ్ కి పెళ్లి కాకుండా ఉంటే తానే రణవీర్ సింగ్ ని పెళ్లాడే దానిని అని రకుల్ ఎటువంటి మొహమాటాలు పోకుండా చెప్పేసింది. బాలీవుడ్ లో ఫుల్ ఫామ్ లో ఉన్న రణవీర్ తో కలిసి సినిమా చెయ్యాలంటే ఈ మాత్రం పొగడ్తలు అవసరమని రకుల్ కి బాగా తెలుసు. అందుకే అవకాశం రాగానే రణవీర్ పై తనకున్న ఇష్టాన్ని బయటపెట్టింది ఈ భామ.

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*