నిన్న రకుల్.. నేడు కీర్తి..!

kerrthi suresh weight loss

టాలీవుడ్ లో హిట్ అయినా హీరోయిన్స్ కి మాత్రం బాలీవుడ్ మీదే చాలా ప్రేమ ఉంటుంది. సౌత్ హీరోయిన్స్ ఫైనల్ టార్గెట్ బాలీవుడ్ అన్న లెక్కన హీరోయిన్స్ అంతా బాలీవుడ్ మీదే ఆశలు పెంచుకుంటారు. అవకాశం రాగానే అక్కడ వాలిపోతారు. ఇక సౌత్ లో గ్లామర్ డోస్ ని లెక్కగా చూపించడానికి అలవాటుపడిన భామలు.. బాలీవుడ్ కి వెళ్లగానే అక్కడ అడ్డూ అదుపు లేకుండా రెచ్చిపోతారు. తాజాగా ఇక్కడ కూడా గ్లామర్ షో చేసే రకుల్ ప్రీత్ బాలీవుడ్ ఆ గ్లామర్ షోని డబుల్ చేసింది. అజయ్ దేవగన్ సరసన ‘దే దే ప్యార్ దే’లో నటిస్తున్న రకుల్ ఈ సినిమా కోసమే ఏకంగా 10 కిలోల బరువు తగ్గింది. ఎప్పుడూ జిమ్ లో వర్కౌట్స్ చేసే రకుల్.. ఈ బాలీవుడ్ మూవీ కోసమే అంతలా తగ్గిపోయింది.

రకుల్ బాటలోనే కీర్తి సురేష్

ఇప్పుడు మరో సౌత్ భామ బరువు తగ్గడానికి రెడీ అయ్యింది. ఆమె ఎవరో కాదు.. మహానటి ఫేమ్ కీర్తి సురేష్. సౌత్ లో పెద్దగా ఆఫర్స్ లేని కీర్తి సురేష్ కి బాలీవుడ్ ఆఫర్స్ వస్తున్నాయి. త్వరలోనే బాలీవుడ్ కి వెళ్లబోతున్న ఈ బొద్దు సుందరి ఇప్పుడు ఓ సినిమా కోసం బరువు తగ్గబోతోందట. బోనీ కపూర్ అజయ్ దేవగణ్ హీరోగా తెరకెక్కిస్తున్న సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్. మరి మహానటి కోసం బాగా బరువెక్కిన కీర్తి సురేష్ కు.. ఆ బరువు వలన చాలా అవకాశాలు చేజారాయి. అందుకే ఇప్పుడు బాలీవుడ్ మూవీ కోసం బాగా బరువు తగ్గబోతోందట. జిమ్ కి వెళ్లడం, డైటింగ్ చెయ్యడం వంటి వాటితో ఇప్పటికే కీర్తి బరువు కాస్త తగ్గినట్లుగా టాక్. ఇకపోతే అజయ్ దేవగన్ సినిమాలో కీర్తి డ్యూయెల్ రోల్ చేస్తుందట.

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*