ఎందుకు టెన్షన్ పడుతున్నాడు

కరోనా

రామ్ చరణ్ నిర్మాతగా హీరోగా.. కెరీర్ ని బ్యాలెన్స్ చేస్తున్నాడు. ఒకేసారి రెండు పెద్ద ప్రాజెక్టుల కోసం పని చేస్తున్నాడు. అందులో రాజమౌళితో RRR చేస్తున్న రామ్ చరణ్.. తన తండ్రి చిరు కోసం సై రా సినిమాని నిర్మించాడు. షూటింగ్ టైం లో నిర్మాతగా ప్రొడక్షన్ మేనేజర్ ని పెట్టి మ్యానేజ్ చేయొచ్చు కానీ.. సినిమా రిలీజ్ టైం లో నిర్మాతగా సినిమాని పక్కాగా ప్రమోట్ చెయ్యాల్సిన అవసరం ఉంటుంది. సై రా సినిమా అక్టోబర్ 2 న విడుదల కానుండడం.. విడుదలకు కేవలం 15 రోజుల టైం ఉండడంతో.. సినిమా ప్రమోషన్స్ ఇంకా సరిగ్గా మొదలు కాలేదు. రేపు సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుకుంటే.. తాజాగా అది కాస్త పోస్ట్ పోన్ అయినట్లుగా వార్తలొస్తున్నాయి. మళ్ళీ ఈవెంట్ ని భారీగా ప్లాన్ చెయ్యాలంటే.. అది ఒకరంగా ఒత్తిడి పెరిగినట్లే.

చరణ్ మీద పెరుగుతున్న ఒత్తిడి …..

మరోపక్క RRR లో ఎన్టీఆర్ షూటింగ్ ని బల్గెరియాలో ముగించి జక్కన్న అండ్ టీం హైదరాబాద్ కి వచ్చేసినట్లుగా తెలుస్తుంది. అంటే నెక్స్ట్ RRR షూటింగ్ షెడ్యూల్ చరణ్ మీదే ప్లాన్ చేసి ఉంటారు. కానీ చరణ్ మాత్రం సైరా ప్రమోషన్స్ లో భాగం కావాలి. లేదంటే… సినిమా మీద క్రేజ్ తగ్గిపోతుంది. మరో పక్క రాజమౌళి అనుకున్న టైంకి RRR ని విడుదల చెయ్యాలంటే…. షూటింగ్ పర్ఫెక్ట్ గా జరగాలి. ఈ రెండు సినిమాల విషయంలో రామ్ చరణ్ కూల్ గా ఉండలేకపోతున్నాడని.. చరణ్ సన్నిహితులు చెబుతున్నారు. ఒక పక్క భారీ బడ్జెట్ తో నిర్మించిన సినిమా, మరోపక్క భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాల మధ్య రామ్ చరణ్ ఒత్తిడి కి గురవుతున్నట్లుగా వార్తలొస్తున్నాయి.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*