ఈసారి లిస్ట్ లోకి రామ్ చరణ్..!

Ramcharan

మళ్లీరావా, జెర్సీ సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులపై తనదైన ముద్ర వేసిన దర్శకుడు గౌతమ్ తిన్నసూరి నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద ఇప్పుడు అందరి కళ్ళు ఉన్నాయి. గౌతమ్ తన తర్వాతి సినిమాని ఎలాంటి కథతో, ఏ హీరోతో చేస్తాడో అనేదాని మీద గత రెండు రోజులుగా రోజుకో హీరో పేరు తెరమీదకి వస్తుంది. జెర్సీ సినిమా చూసి సినిమా అదుర్స్ అని యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో పాటు అల్లు అర్జున్ కూడా గౌతమ్ ని కాస్త పొగిడారో లేదో గౌతమ్ తిన్నసూరి నెక్స్ట్ మూవీ ఎన్టీఆర్ లేదంటే అల్లు అర్జున్ అంటూ వార్తలు వచ్చాయి. అయితే తాజాగా మరో స్టార్ హీరో పేరు తెరమీదకి వచ్చింది. రామ్ చరణ్ ప్రస్తుతం #RRR సినిమాకి కమిట్ అయ్యి.. వచ్చే ఏడాది జూన్ వరకు ఖాళీ లేకుండా ఉన్నాడు. #RRR తరువాత రామ్ చరణ్ చెయ్యబోయే ప్రాజెక్ట్ మీద ఎలాంటి క్లారిటీ లేదు. తాజాగా రామ్ చరణ్ #RRR తర్వాత గౌతమ్ తిన్నసూరి డైరెక్షన్ లో నటించే అవకాశాలు ఉన్నట్లుగా వార్తలొస్తున్నాయి.

రామ్ చరణ్ కు కథ చెప్పనున్న గౌతమ్

గౌతమ్ తిన్నసూరి తన తర్వాతి సినిమాని ఎన్వీ ప్ర‌సాద్ బ్యాన‌ర్‌లో చెయ్యాల్సి ఉంది. ఇక మూడో సినిమా కథని గౌతమ్ పీరియాడిక‌ల్ స్టోరీగా రాసుకున్నాడని.. ఆ కథకి రామ్ చరణ్ అయితే సరిగ్గా సరిపోతాడని.. అందుకే చరణ్ కి ఆ కథని ఎలాగైనా వినిపించాలనే ప్రయత్నాల్లో గౌతమ్ తిన్నసూరి ఉన్నాడంటున్నారు. మరి మళ్లీరావా అనే లవ్ స్టోరీ తర్వాత రెండో సినిమాకే కాస్త డిఫరెంట్ కథతో జెర్సీ లాంటి ప్రాజెక్ట్ చేసిన గౌతమ్ తిన్నసూరి చెప్పబోయే కథకి రామ్ చరణ్ గ్యారెంటీగా ఇంప్రెస్ అయ్యే సూచనలు ఉన్నాయనే టాక్ వినబడుతుంది. మరి #RRR షూటింగ్ లో గాయపడిన రామ్ చరణ్ మాత్రం గౌతమ్ కథ చెబుతానంటే వినే అవకాశం ఉంది. ఒకవేళ కథ విని రామ్ చరణ్ ఓకె చెప్పినా గౌతమ్ మరో ఏడాది రామ్ చరణ్ కోసం వెయిట్ చెయ్యాల్సి ఉంటుంది.

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*