చరణ్ ఎలా ఒప్పించడబ్బా..?

కరోనా

కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార స్టార్ హీరోలతో సమానమైన రేంజ్ లో క్రేజ్ సంపాదించింది. చిన్న హీరోలతోనే కాదు.. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతోనూ సత్తా చాటుతుంది. స్టార్ హీరోలకు ఏ మాత్రం తీసిపోని నయనతార చాలాకాలంగా తాను నటిస్తున్న సినిమాల ప్రమోషన్స్ కి దూరంగా ఉంటోంది. సినిమా షూటింగ్ అవ్వడంతోనే.. ప్యాకప్ చెప్పేసి వెళ్ళిపోయి.. మళ్ళీ ప్రమోషన్స్ కి ఎట్టి పరిస్థితుల్లోనూ కనబడకుండా దర్శకనిర్మాతలకు మొహం చాటేస్తోంది నయనతార. కానీ ఏ నిర్మాతైనా పట్టుబడితే మాత్రం ప్రమోషన్స్ కి సపరేట్ పారితోషకం డిమాండ్ చేస్తుందనే టాక్ ఉంది.

ఎట్టకేలకు ఒప్పించిన రామ్ చరణ్

ఇక తెలుగు సినిమా నిర్మాతలు కూడా నయనతార డిమాండ్స్ కి తలొగ్గి ఆమె ప్రమోషన్స్ కి రాకపోయినా సైలెంట్ అవుతున్నారు. తాజాగా ఒక నిర్మాత నయనతార నటిస్తున్న బడా సినిమా ప్రమోషన్స్ కి రావడానికి ఒప్పించాడట. మరి ఆ నిర్మాత ఎవరో కాదు.. తండ్రి సినిమాలను వరసగా నిర్మిస్తున్న స్టార్ హీరో రామ్ చరణ్. చిరు పక్కన సైరా నరసింహ రెడ్డిలో కీలక పాత్రలో అంటే మెయిన్ హీరోయిన్ గా సిద్దమ్మ అనే క్యారెక్టర్ లో నయనతార నటిస్తుంది. సైరా నరసింహారెడ్డి తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో భారీగా విడుదల కాబోతుంది. అలాంటి సినిమాకి… సినిమాలో నటించే నటీనటులంతా ప్రమోషన్స్ లో పాల్పంచుకుంటే.. సినిమా క్రేజ్ మరింత పెరుగుతుంది.

భారీ సినిమా కావడంతో…

కానీ నయనతార స్వతాహా ప్రమోషన్స్ కి వచ్చే రకం కాదు. మరి భారీ సినిమా.. అందులోనూ నాలుగు భాషల్లో విడుదలవుతున్న సినిమా గనక నయనతార కూడా ప్రమోషన్స్ లో పాల్గొంటే బాగుంటుందని.. ఆ సినిమా నిర్మాత రామ్ చరణ్ నయనతారని సైరా ప్రమోషన్స్ లో పాల్గొనేందుకు ఒప్పించినట్లుగా తెలుస్తుంది. ఇక నయన్ కూడా చరణ్ అడగడంతో కాదనలేకపోయిందట. మరి ఈ లెక్కన సైరా ఇంటర్వూస్ లో, ఆడియో లాంచ్, సక్సెస్ మీట్స్ లో ఈ సారి నయనతారని మనం చూడొచ్చన్నమాట.

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*