ఫ్లాప్ హీరోయిన్స్ తగులుకుంటున్నారుగా..!

రామ్

నేను శైలజ హిట్ తర్వాత మళ్లీ హిట్ కోసం ఎదురు చూపులు చూస్తున్న రామ్ పోతినేనికి వరుస ఫ్లాప్స్ తగులుతున్నాయి కానీ హిట్ రావడం లేదు. తాజాగా రామ్ పోతినేని ప్లాప్ లో ఉన్నపుడు ఒక అట్టర్ ప్లాప్ డైరెక్టర్ కి అవకాశమిచ్చాడు. భారీ డిజాస్టర్స్ తో ఉన్న పూరీ జగన్నాధ్ తో రామ్ తన నెక్స్ట్ మూవీ చేస్తున్నాడు. ఇప్పటికే మొదలైన రామ్ – పూరీ జగన్నాధ్.. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో ఇంకా హీరోయిన్స్ ఫైనల్ అవ్వలేదు. మరి షూటింగ్ కి మొదలయ్యే ముందే పూరీ పక్కాగా హీరోయిన్స్ ని కూడా సెట్ చేసుకుని దిగుతాడు కానీ.. రామ్ కోసం మాత్రం ఇంకా హీరోయిన్స్ ని ఫైనల్ చేయలేదు. తాజాగా రామ్ సరసన ఫ్లాప్ హీరోయిన్స్ పేర్లు గట్టిగా వినబడుతున్నాయి. అందులో మొదటి పేరు అజ్ఞాతవాసి, నా పేరు సూర్య, శైలజారెడ్డి అల్లుడు సినిమాల ఫ్లాప్ హీరోయిన్ అను ఇమ్మాన్యువల్ పేరు వినబడుతోంది.

ismart shankar shoot begins

ఎవరిని సెట్ చేస్తారో..?

తాజాగా సవ్యసాచి బ్యూటీ నిధి అగర్వాల్ పేరుతో పాటు నన్ను దోచుకుందువటేతో యావరేజ్ అందుకున్న నాభ నటాషా పేర్లు గట్టిగా వినబడుతున్నాయి. సవ్యసాచి. తాజాగా మిస్టర్ మజ్ను సినిమాలతో ఖంగుతిన్న నిధి అగర్వాల్ రామ్ సరసన అంతగా నప్పదనే టాక్ వినబడుతుంది. ఆమెకు నటనలో పెద్దగా మెళుకువలు తెలియవు. కేవలం గ్లామర్ మీద నెట్టుకొస్తుందంటున్నారు. ఇక నాభ నటాషా నన్ను దోచుకుందువటేలో బాగానే మెప్పించింది. అందుకే నాభ… రామ్ సరసన పర్ఫెక్ట్ అంటున్నారు కానీ.. పూరీ మైండ్ లో ఏ హీరోయిన్ ఉందో తెలియదు. మాములుగా పూరీ జగన్నాధ్ కొత్త హీరోయిన్స్ ను పరిచయం చెయ్యడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతుంటాడు. మరి ఫైనల్ గా ఇస్మార్ట్ శంకర్ లో రామ్ పోతినేని పక్కన ఏ హీరోయిన్స్ నటిస్తారో చూడాలి.

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*