అనుకున్నంత లేదటగా

#RRR alia bhatt

నిన్నగాక మొన్న శ్రద్ద కపూర్ సాహో సినిమాలో ప్రభాస్ తో పాటుగా ఫుల్లెన్త్ రోల్ లో నటించింది. RRR కోసం బాలీవుడ్ నుంచి అలియా భట్ దిగుతుంది. బాలీవుడ్ భామలు టాలీవుడ్ హీరోల పక్కన నటిస్తున్నారు. సౌత్ ని, నార్త్ ని టార్గెట్ చేస్తూ సినిమాలు తియ్యడంలో దర్శక నిర్మాతలు బాలీవుడ్ హీరోయిన్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. RRR లో సీత పాత్ర కోసం అలియా భట్ ని రామ్ చరణ్ కి జోడిగా తీసుకున్నాడు రాజమౌళి. దీనికోసమే భారీ పారితోషకం కూడా ఇచ్చారని చెబుతున్నారు. అలియా భట్ అనగానే RRR పై బాలీవుడ్ లోనూ అంచనాలు పెరిగాయి.

సీతపాత్రతో….

మరి చరణ్ పక్కన సీత పాత్రలో అలియా ని మెగా ఫ్యాన్స్ ఊహించుకుంటున్నారు. అయితే అల్లూరి సీత రామరాజుగా చరణ్ సరసన సీత పాత్రలో అలియా భట్ కొద్దిసేపు మాత్రమే కనబడుతుందట. అంటే RRR లో అలియా చేయబోయేది గెస్ట్ లాంటి పాత్ర మాత్రమే. చరణ్ సీన్స్ అధికంగా వుంటాయట కానీ.. సీత గా అలియా కొన్ని సీన్స్ కే పరిమితం కాబోతుంది. ఈ విషయాన్నీ స్వయానా అలియానే బయటపెట్టింది. తనకి బాలీవుడ్ లో సంజయ్ లీలా బన్సాలీ, టాలీవుడ్ లో రాజమౌళి సినిమాల్లోనూ చిన్న అవకాశం వచ్చినా చాలనుకునేదాన్ని అని.. అందుకే పాత్ర చిన్నదా? పెద్దదా? అని ఆలోచించకుండా RRR కోసం వచ్చానని చెబుతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*