రమ్యకృష్ణా మజాకా

ఒకప్పుడు హీరోయిన్ గా టాప్ పొజిషన్ ని చవి చూసిన రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ లో సో సో గానే ఉండేది. కానీ బాహుబలి తో రమ్యకృష్ణ సినిమా కెరీర్ అమాంతం టర్న్ తిరిగింది. బాహుబలి లో శివగామిగా రమ్యకృష్ణ కెరీర్ లోనే బెస్ట్ పెరఫార్మెన్స్ ఇచ్చింది. ఇక ఆ సినిమాతో రమ్యకృష్ణ కి ఇక ఎదురులేకుండా పోయింది. అందుకే రమ్యకృష్ణ బాహుబలి తర్వాత తన రెమ్యునరేషన్ ని భారీగా పెంచేసింది. మరి ఆమెకున్న క్రేజ్ ముందు ఆమె ఎంత డిమాండ్ చేస్తే అంత ఇవ్వడానికి వెనకడుగు వెయ్యడం లేదు. రమ్యకృష్ణ ఇప్పుడు రోజుకింత అని వసూలు చేస్తుందట.

ఒక్క రోజుకి అత్యధికంగా రమ్యకృష్ణ 6 లక్షల దాకా ఛార్జ్ చేస్తుందట . షూటింగ్ కోసం ఎన్ని కాల్ షీట్స్ కావాలంటే అన్ని ఆరు లక్షలు నిర్మాతలు మల్టి ప్లై చేసుకోవాలన్న మాట. మరి బాహుబలి తర్వాత రమ్యకృష్ణ చేసిన సినిమాలన్నీ ఆ రేంజ్ పారితోషకమే అందుకుంటుందట. తాజాగా నాగ చైతన్యకి అత్తగా మారుతీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న శైలజ రెడ్డి అల్లుడు సినిమా కి రమ్యకృష్ణ 45 రోజుల కాల్షీట్స్ ఇచ్చిందట. మరి 45 రోజులంటే రోజుకి 6 లక్షల చొప్పున రమ్యక్రిష్ణ అక్షరాలా 2.7 కోట్లు అందుకుంటున్నమాట. మరి ప్రస్తుతం టాలీవుడ్ లో ఏ హీరోయిన్ కూడా ఈ రేంజ్ లో పారితోషకం అందుకోవడం లేదు.

కానీ వయసైపోయిన, రమ్యకృష్ణ మాత్రం ఇలా సెకండ్ ఇన్నింగ్స్ లోను అదరగొట్టే పారితోషకం అందుకుని అందరికి షాకిస్తుంది. ఇకపోతే శైలజ రెడ్డి అల్లుడు సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న అను ఇమ్మాన్యువల్ అయితే రమ్యకృష్ణ అందుకుంటున్న దాని లో సగమైనా అందుకుంటుందో లేదో అనేది కూడా డౌట్. ఇక శైలజ రెడ్డి అల్లుడు టైటిలే తన పేరు మీద ఉంది కాబట్టి అందులోనూ కీలకమైన పాత్ర కాబట్టి రమ్యకృష్ణ డిమాండ్ చేసిన రోజుకి ఆరు లక్షల పారితోషకాన్ని మారు మాట్లాడకుండా నిర్మాత ఒప్పుకున్నట్టు సమాచారం

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*