రంగస్థలం మొదటివారం రెండు తెలుగు రాష్ట్రాల లెక్కలు
రామ్ చరణ్ రంగస్థలం థియేటర్స్ బూజు దులిపేసింది. మూడు నెలలుగా ఒక్క భారీ చిత్రం కూడా సాధించని కలెక్షన్స్ రంగస్థలం సాధించి అదరగొట్టేసింది. మార్చ్ 30 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన రంగస్థలం నిన్న గురువారం నాటికీ ఒక వారం పూర్తి చేసుకుంది. విడుదలైన మొదటి షో నుండే పాజిటివ్ అండ్ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోయిన రంగస్థలం బాక్సాఫీసుని చీల్చి చెండాడింది. ఓవర్సీస్, రెండు తెలుగు రాష్ట్రాలు, ఆధర్ ఏరియాలలో తన హవా చూపిస్తుంది. చిట్టిబాబు, రామలక్ష్మి, ఫణింద్ర భూపతి, రంగమ్మత్త, కుమార్ బాబు ల నటనకు ప్రేక్షకులు బ్రహ్మ రధం పడుతున్నారు. ఇక వారం నుండి తన సత్తా చాటుతున్న రంగస్థలం మరో వారం కూడా కలెక్షన్స్ వర్షం కురిపించేందుకు సిద్ధం అయ్యింది. ఎందుకంటే నితిన్ - మేఘ ఆకాష్ లు జంటగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో వచ్చిన ఛల్ మోహన్ రంగ టాక్ యావరేజ్ గా ఉండడం.. ఈ శుక్రవారం మరో గట్టి పోటీ నిచ్చే సినిమా లేకపోవడం కూడా రంగస్థలం సినిమాకి కలిసొచ్చే అంశం. మరి రంగస్థలం రెండు తెలుగు రాష్ట్రాల ఫస్ట్ వీకెంట్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసేద్దామా...
ఏరియా మొదటివారం షేర్స్ కోట్లలో...
నైజాం 16.73
సీడెడ్ 11.50
నెల్లూరు 2.11
కృష్ణా 4.67
గుంటూరు 6.12
వైజాగ్ 8.03
ఈస్ట్ గోదావరి 5.23
వెస్ట్ గోదావరి 4.02
ఏపీ మరియు తెలంగాణ మొదటి వారం షేర్స్ కోట్లలో: 58.41 కోట్లు