ఈ సినిమాల హిట్స్ ఆమెకి చాలా అవసరం
కొంతమంది హీరోయిన్స్ ప్రమోషన్స్ కి చేతులెత్తేస్తారు. మాకా పని ఉంది, ఈ షూటింగ్ ఉంది అంటూ తప్పించుకుంటారు. కానీ ఎక్కడో కొంతమంది హీరోయిన్స్ మాత్రం తమ పనిని [more]
కొంతమంది హీరోయిన్స్ ప్రమోషన్స్ కి చేతులెత్తేస్తారు. మాకా పని ఉంది, ఈ షూటింగ్ ఉంది అంటూ తప్పించుకుంటారు. కానీ ఎక్కడో కొంతమంది హీరోయిన్స్ మాత్రం తమ పనిని [more]
కొంతమంది హీరోయిన్స్ ప్రమోషన్స్ కి చేతులెత్తేస్తారు. మాకా పని ఉంది, ఈ షూటింగ్ ఉంది అంటూ తప్పించుకుంటారు. కానీ ఎక్కడో కొంతమంది హీరోయిన్స్ మాత్రం తమ పనిని సక్రమంగా నిర్వర్తిస్తారు. స్టార్ హీరోల అవకాశాల కోసం నిత్యం కష్టపడుతున్న రాశి ఖన్నా లాంటోళ్ళయితే.. ప్రమోషన్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతం రాశి ఖన్నా పొద్దున్న ఓ సినిమా ప్రెస్ మీట్, సాయంత్రం మరో సినిమా ఇంటర్వూస్ తో బిజీ బిజీగా గడుపుతుంది. అందంగా గ్లామర్ గా రెడీ అయ్యి వెంకిమామా, ప్రతిరోజూ పండగే సినిమాల ప్రమోషన్స్ కోసం వెళుతుంది. రెండు సినిమాలు వారం గ్యాప్ తో రాబోతున్నాయి గనక రాశి ఖన్నా ఇలా ప్రమోషన్స్ తో బిజీ అయ్యింది.
రెండు సినిమాల్లో నటిస్తున్నప్పుడు డేట్స్ సర్దుబాటు చేసుకోవచ్చు కానీ… రెండు సినిమా ప్రమోషన్స్ అంటే చాల కష్టం. కానీ రాశి ఖన్నా మాత్రం చాలా బ్యాలెన్సుడ్ గా వెంకిమామా, ప్రతి రోజు పండగే సినిమాలని చుట్టేస్తోంది. అయితే ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా హిట్ అయినా రాశి ఖన్నా కి తిరుగుండదు. లేదంటే పాపకి టాలీవడ్ లో కష్టమే. మరోపక్క విజయ్ దేవరకొండ వరల్డ్ ఫెమస్ లవర్ ఉన్నప్పటికీ… ఆసినిమాలో ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ తో కలిసి నటించడం వలన ఆ సినిమాపై రాశికి ఆశలు లేవు. అందుకే రెండు సినిమాల ప్రమోషన్స్ ని రెస్ట్ లేకుండా చేస్తూ దర్శకనిర్మాతలకు తానెప్పుడూ అందుబాటులో ఉంటానని చెప్పకనే చెబుతుంది. అలాగే ప్రతి రోజు పండగే, వెంకిమామ హిట్స్ కోసం తహతహలాడుతోంది ఈ హీరోయిన్.