రేటు పెంచేసింది!

Rashmika mandanna movie with allu arjun

ఏ హీరోయిన్ అయినా ఒక్క హిట్ పడితే ఒక్కసారిగా ఆమె రేంజ్ ఆకాశాన్నంటేస్తుంది. ఏదో సుడి ఉండి హిట్స్ మీద హిట్స్ పడిందా స్టార్ హీరోయిన్ అయ్యి కూర్చుంటుంది. అందుకే ఒక హిట్ పడిపడగానే తన పారితోషకం విషయంలోనూ ఒక రేంజ్ కి వెళ్ళిపోతుంది. కన్నడ లో కిర్రాక్ పార్టీ ద్వారా తెలుగు దర్శకనిర్మాత దృష్టిలో పడిన రష్మిక మందన్న పరిస్థితి ఇప్పుడు అలానే ఉంది. నాగ శౌర్య హీరోగా ఐరా క్రియేషన్ లో తెరకెక్కిన ఛలో సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్న ఆ సినిమాతో సాలిడ్ హిట్ అందుకుంది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ తో కలిసి గీత గా గీత గోవిందం సినిమాలో నటించింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి కూర్చుంది.

గీత గోవిందం సినిమాలో గీతగా రష్మిక నటనకు అందరూ ముగ్దులైపోయారు. గీత గోవిందం తర్వాత మళ్ళీ విజయ్ దేవరకొండతోనే డియర్ కామ్రేడ్ సినిమా లో క్రికెటర్ గా రష్మిక మందన్న నటించనుంది. ఇంకా నాని – నాగ్ మల్టీస్టారర్ లో రష్మిక నాని కి హీరోయిన్ గా నటిస్తుంది. అయితే వరసగా రెండు హిట్స్ అందుకోవడంతో.. రష్మిక ఇపుడు లక్కీ గర్ల్ లా మరిపోయింది. అందుకే తనకున్న క్రేజ్ ని ఇప్పుడు క్యాష్ చేసుకునే పనిలో రష్మిక పడిందనే టాక్ ఫిలిం సర్కిల్స్ లో వినబడుతుంది. ఇప్పుడు అందుకుంటున్న పారితోషికాన్ని రెట్టింపు చేసి…. తనను సంప్రదిస్తున్న నిర్మాతలకు తన మేనేజర్ ద్వారా చెప్పిస్తుందనే టాక్ నడుస్తుంది. ఇప్పటికే సెట్స్ మీదున్న దేవదాస్, డియర్ కామ్రేడ్ సినిమాలకు పాత పారితోషకాన్ని కంటిన్యూ చేస్తుందట రష్మిక.

ఇక దేవదాస్, డియర్ కామ్రేడ్ సినిమాలు తప్ప రష్మికకు కొత్త ప్రోజెక్టులేమి చేతులో లేవు. మరి ఛలో, గీత గోవిందం తర్వాత రష్మిక డిమాండ్ పెరిగిపోయింది. అందుకే అమ్మడు ఇప్పుడు అరకోటి దాకా దర్శకనిర్మాతల నుండి డిమాండ్ చేస్తుందట. మరి అమ్మడుకి లక్కుంది కాబట్టి ఆమె అడిగింది ఇవ్వడానికి చాలామంది మొగ్గు చూపుతున్నారట. గ్లామర్ కి దూరంగా ఉంటూ హిట్స్ కొడుతున్న రష్మికకి ఒక్క ప్లాప్ పడిందా పాతాళానికి తోసేస్తారు. అందుకే అమ్మడు దీపముండగానే ఇల్లు చక్కదిద్దేసుకుంటుందనే టాక్ సోషల్ మీడియాలో వినబడుతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*