అను తప్పుకుంది… శృతి తగులుతుందా?

‘టచ్ చేసి చూడు’ తో ప్లాప్ అందుకున్న రవితేజ ప్రస్తుతం హిట్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ‘నేల టికెట్’ సినిమాలో నటించాడు. ‘నేల టికెట్’ సినిమా వచ్చే శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ‘నేల టికెట్’ సినిమాలో రవితేజ కొత్త హీరోయిన్ మాళవిక శర్మ తో జోడి కట్టాడు. ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక రవితేజ ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ అనే సినిమాలో త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. మూడు విభిన్న పాత్రల్లో కనబడనున్న రవితేజ మూడు పాత్రలకు ముగ్గురు హీరోయిన్స్ ఈసినిమాలో ఉంటారు.

ఈ సినిమా కోసం’ అజ్ఞాతవాసి, నా పేరు సూర్య’ ప్లాప్స్ తో ఉన్న అను ఇమ్మాన్యువల్ ని ఒక హీరోయిన్ గా సెలెక్ట్ చేసింది శ్రీను వైట్ల బృందం. రెండు సినిమాల ప్లాప్స్ తో ఉన్న అను ఇమ్మాన్యువల్ ని హీరోయిన్ గా సెలెక్ట్ చేసి కాస్త సాహసం చేశారనే చెప్పాలి. అయితే లక్కీగా అను ఇమ్మాన్యువల్ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ తప్పుకుంటున్నట్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తనకి ‘శైలజ రెడ్డి అల్లుడు’ సినిమా డేట్స్ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ డేట్స్ సర్దుబాటు కాక ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ నుండి తప్పుకుంటునానట్టుగా ట్వీట్ చేసింది. ఇక అను తప్పుకుంది కానీ.. ఇపుడు తాజాగా ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాలోకి మరో హీరోయిన్ గా ‘కాటమరాయుడు’ తో ప్లాప్ మూటగట్టుకుని సినిమాలకు బై బై చెప్పేసింది అని అనుకుంటున్న శృతి హాసన్ ని రవితేజ కి జోడిగా తీసుకుంటే బావుంటుంది అని అనుకుంటున్నారట. మరి రవితేజ – శృతి హాసన్ లు కలిసి ‘బలుపు’ సినిమాలో నటించారు. ఆ సినిమా యావరేజ్ హిట్ గా నిలిచింది.

ఒకవేళ శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా ఫైనల్ అయ్యింది అంటే గనక… వరసగా రవితేజ తన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాలోకి ప్లాప్ హీరోయిన్స్ ని ఏరి కోరి తీసుకున్నట్టే. అయితే అను ఇమ్మాన్యువల్ ప్రస్తుతం ఈ సినిమా నుండి సైడ్ అయ్యింది కానీ… శృతి హాసన్ ది మాత్రం అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇకపోతే ఈ సినిమాలో శ్రీను వైట్ల… కమెడియన్ గా బ్రహ్మానందం కి బదులుగా హీరో కమ్ కమెడియన్ సునీల్ ని కీలక పాత్రకి ఎంపిక చేసాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమాలో వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి వంటి కమెడియన్స్ కూడా నటిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*