రవితేజ మూవీ ఆగిందా?

ప్రస్తుతం మాస్ రాజా రవితేజ తన మిత్రుడైన శ్రీను వైట్ల డైరెక్షన్ లో ‘అమర్ అక్బర్ ఆంటోని’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రవితేజ త్రీ షేడ్స్ లో కనిపించనున్నాడు. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ లో ఉన్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు.

అలానే ‘కందిరీగ’ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రవితేజ ఇంకో సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకి కూడా మైత్రీ మూవీ మేకర్స్ వారే నిర్మిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ ప్రాజెక్టును ఆపేసినట్టుగా తెలుస్తోంది. కారణం రవితేజ అని తెలుస్తుంది.

తమిళంలో స్టార్ హీరో విజయ్ హిట్ కొట్టిన ‘తెరి’ సినిమా నుంచి మూలకథను తీసుకుని ఈ సినిమాను రూపొందించాలనుకున్నారు. అయితే రీసెంట్ గా రవితేజ చేసిన ‘నేల టిక్కెట్టు’ .. ‘టచ్ చేసి చూడు’ సినిమాలు వరసగా రెండూ డిజాస్టర్స్ అవ్వడంతో.. ఇప్పుడు ఈ సినిమా చేయడం కరెక్ట్ కాదని.. ‘అమర్ అక్బర్ ఆంటోని’ రిజల్ట్ చూసి అప్పుడు ఈ సినిమా గురించి ఆలోచిస్తానని అప్పటివరకు హోల్డ్ లో పెట్టమని చెప్పాడంట. సో దీని ప్రకారం చూసుకుంటే ‘అమర్ అక్బర్ ఆంటోని’ హిట్ అయితే ఈ సినిమా పట్టాలెక్కుతుంది .. లేదంటే లేదన్న మాట.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*