విలన్ గా చేయక తప్పదేమో

రవితేజ

కిక్ 2 సినిమా సమయంలో రవితేజ లుక్స్ మీద బాగా కామెంట్స్ పడ్డాయి. సిక్స్ ప్యాక్ కోసం ట్రై చేసిన రవితేజ కిక్ 2 సినిమాలో బాగా ముసలితనంలో కనిపించాడని.. ఇక హీరోగా రవితేజకు అవకాశాలు అడుగంటిపోతాయనుకున్నారు. తర్వాత బెంగాల్ టైగర్ లో కాస్త ఫ్రెష్ లుక్ లో దర్శనమిచ్చిన రవితేజ, రాజా ధీ గ్రేట్, నేల టికెట్, టచ్ చేసి చూడు సినిమాల్లోనూ మునుపుటి లుక్స్ అయితే చూపించలేకపోయాడు. అయితే తాజాగా అమర్ అక్బర్ ఆంటోని సినిమాని శ్రీను వైట్ల దర్శకత్వంలో చేసాడు. ఈ సినిమాలో రవితేజ మూడు డిఫ్రెంట్ గెటప్స్ లో కనిపిస్తున్నాడు.

ప్రస్తుతం అమర్ అక్బర్ ఆంటోని సినిమా ప్రమోషన్స్ లో ఉన్న రవితేజ చాలా ఆసక్తికర విషయాలను మీడియా మిత్రులతో పంచుకుంటున్నాడు. ఇంకా ఈ సినిమా గురించి రవితేజ మాట్లాడుతూ… సినిమాలో నేను పోషించిన అమర్ అక్బర్ ఆంటోని పాత్రలు మూడు కూడ వేటికవే వైవిధ్యభరితమైనవి. ఈ మూడు పాత్రల్లోను కొత్తగా కనిపిస్తాను.. అని చెబుతున్నాడు. అలాగే అమర్, అక్బర్, ఆంటోని పాత్రల్లో తనకి అమర్ పాత్ర బాగా నచ్చిందని చెబుతున్నాడు. ఇక అమర్ పాత్ర సినిమా కె హైలెట్ అవుతుందనే కాన్ఫిడెన్స్ లో రవితేజ ఉన్నాడు.

ఇక రవితేజ ఎక్కడికి వెళ్లినా… ఆయన అభిమానులు ఆయన్ని విలన్ పత్రాలు కూడా చెయ్యొచ్చు కదా అని అడుగుతున్నారట. మరి విలన్ గా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చెయ్యాలంటే… అప్పుడే కాదు… దానికి మరికొంత సమయం ఉంది… ఫ్యూచర్ లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించాలంటే.. అందులో భిన్నత్వం ఉండేలా కోరుకుంటానంటూ చెబుతున్నాడు రవితేజ. మరి ఒకప్పుడు హీరోలుగా చక్రం తిప్పిన అరవింద స్వామి, అర్జున్, మాధవన్ వంటి హీరోలు విలన్స్ గా రాణిస్తున్నారు కూడా. ఇక జగపతి బాబైతే… హీరోగా కెరీర్ ని ముగించేసి… విలన్ గా సెకండ్ ఇన్నింగ్స్ లో దోసుకుపోతున్నాడు. ఇక వీళ్ళలాగే రవితేజ కూడా హీరో గా కెరీర్ అయ్యింది అనుకున్నాక విలన్ గా రంగప్రవేశం చేస్తాడేమో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*