సైలెంట్ గా పెళ్లి చేసుకున్న ప్రభాస్ హీరోయిన్?
లీడర్ సినిమా తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన రిచా గంగోపాద్యాయ రవితేజ మిరపకాయ్, ప్రభాస్ మిర్చి సినిమాల్తో బాగా పేరు తెచ్చుకుంది. కానీ… ఆమె కెరీర్ [more]
లీడర్ సినిమా తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన రిచా గంగోపాద్యాయ రవితేజ మిరపకాయ్, ప్రభాస్ మిర్చి సినిమాల్తో బాగా పేరు తెచ్చుకుంది. కానీ… ఆమె కెరీర్ [more]
లీడర్ సినిమా తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన రిచా గంగోపాద్యాయ రవితేజ మిరపకాయ్, ప్రభాస్ మిర్చి సినిమాల్తో బాగా పేరు తెచ్చుకుంది. కానీ… ఆమె కెరీర్ అనుకున్నంతగా లేకపోవడంతో.. చదువుకుంటా అంటూ అమెరికా చెక్కేసింది. అయితే గత ఏడాది రిచా గంగోపాద్యా లవ్ లో ఉంది.. పెళ్లి చేసుకోబోతుంది అంటూ కొన్ని వెబ్ సైట్స్ ప్రచురించడంతో…. రిచా అజ్ఞాతంలో నుండి బయటికొచ్చి తన మేనేజర్ చేత..అవన్నీ ఒట్టి పుకార్లే నేనేమి పెళ్లి చేసుకోవట్లేదని చెప్పించింది. అయితే తాజాగా రిచా తన బాయ్ ఫ్రెండ్ ని సైలెంట్ గా అమెరికా లో పెళ్లి చేసుకున్న ఫొటోస్ ఇప్పుడు సాంఘీక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
ఈ ఏడాది మొదట్లోనే బోయ్ ఫ్రెండ్ జోతో ఎంగేజ్మెంట్ చేసుకున్న రిచా తాజాగా రెండు రోజుల క్రితం జోతో పెళ్లి పెట్టాలెక్కింది. రిచా – జో ల పెళ్లి అటు హిందూ సంప్రదాయం ప్రకారం తాళిబొట్టు కట్టడం, ఇటు క్రిష్టియన్ సంప్రదాయం ప్రకారం చర్చ్ లో వేలికి ఉంగరం తొడగడంతో రెండు సాంప్రదాయక పద్ధతుల్లో రిచా పెళ్లి జరిగిపోయింది. రిచా తన స్కూల్ మేట్ జో ని ప్రేమించి పెళ్లాడింది. ఇక ఈ పెళ్లి అమెరికాలో జరిగినట్టుగా సమాచారం. ప్రస్తుతం రిచా గంగోపాధ్యాయ పెళ్లి ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి