రామ్ చరణ్ కి ఎక్కువ.. ఎన్టీఆర్ కి తక్కువ

mahesh babu maharshi party

రాజమౌళి దర్శకత్వంలో #RRR మూవీ పట్టాలెక్కేసి అప్పుడే పది రోజులు పూర్తయిపోయింది. నవంబర్ 11 నే సినిమా ఓపెనింగ్ జరిగినా రెగ్యులర్ షూటింగ్ మాత్రం నవంబర్ 19 నుండి స్టార్ట్ అయ్యింది. రెగ్యులర్ షూటింగ్ మొదలెట్టగానే మొదటగా రాజమౌళి స్టార్ హీరోస్ ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ ల మీద యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు. ప్రస్తుతం టాప్ టెక్నీషియన్స్ సమక్షంలో #RRR చిత్ర బృందం మొత్తం మొదటి షెడ్యూల్ షూటింగ్ లో బాగా బిజీ అయ్యింది. మరి మొదటి షెడ్యూల్ షూటింగ్ లో ఎన్టీఆర్ మీద చరణ్ మీద విడివిడిగా యాక్షన్ సన్నివేశాలను రాజమౌళి చిత్రీకరిస్తున్నాడా? అంటే అవుననే సమాధానమే వస్తుంది.

ఎందుకంటే తాజాగా తెలుస్తున్న న్యూస్ ప్రకారం ఈ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ ని రామ్ చరణ్.. మరో హీరో ఎన్టీఆర్ కంటే ముందుగా రెండు రోజుల్లో పూర్తి చేసుకోబోతున్నాడట. మరి ఈ రెండు రోజుల టైం లోనే రాజమౌళి ఎన్టీఆర్ తో మరికొన్ని సీన్స్ ని చిత్రీకరించబోతున్నాడట. మరి రకరకాల కథలు ప్రచారం లో ఉన్న #RRR కథ ప్రకారం రామ్ చరణ్ కి ఈ సినిమాలో ఎక్కువ యాక్షన్ సీన్స్ ఉంటాయంటున్నారు. ఇక ఎన్టీఆర్ కి తక్కువ యాక్షన్ సీన్స్ ఉన్నప్పటికీ…. ఎమోషనల్ గా ఎన్టీఆర్ పాత్ర ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని చెబుతున్నారు. మరి రాజమౌళి… రామ్ చరణ్, ఎన్టీఆర్ కి పాత్రల సారూప్యంలో ఎక్కడా హెచ్చు తగ్గులు లేకుండా ఇద్దరి అభిమానులను సంతృప్తి పరచాలనే ఉద్దేశ్యంతోనే ఉన్నాడట. ఇక #RRR మూవీ సెకండ్ షెడ్యూల్ లో స్టార్ హీరోలతో పాటుగా హీరోయిన్స్ కూడా జాయిన్ అవుతారట.

అయితే #RRR సెకండ్ షెడ్యూల్ కూడా త్వరగా కంప్లీట్ చేసి తన కొడుకు కార్తికేయ పెళ్లి టైం కి జక్కన ఫ్రీ అవుతాడని అంటున్నారు. మరి రాజమౌళి కొడుకు కార్తికేయ పెళ్లి జనవరి మొదటివారంలో హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్ లో స్పెషల్ గా వేసిన సెట్టింగ్ లో జరగబోతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*