పాయల్ తో పాటుగా మరో హీరోయిన్ ని లైన్ లో పెట్టాడా?

పాయల్ రాజపుట్ Payal Rajpoot Telugu News

ఎప్పుడూ స్టార్ హీరోయిన్స్ ని నమ్ముకుని సినిమా చేస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ ఈసారి రూటు మార్చాడు. ఇప్పటివరకు ఎక్కువగా స్టార్ హీరోయిన్స్ తోనే జోడి కట్టిన బెల్లంకొండ శ్రీనివాస్ ఈసారి ఒకటిరెండు సినిమాలు చేసిన హీరోయిన్స్ ని లైన్ లో పెట్టేస్తున్నాడు. సీత సినిమాలో ఐటెం తో ఆడిపాడిన పాయల్ రాజపుట్ ని తన తదుపరి చిత్రమైన టైగర్ నాగేశ్వర్ రావు సినిమాలో కి తీసుకున్నాడు. కవచం సినిమా ప్లాప్ తో ఉన్న బెల్లంకొండ శ్రీనివాస్ తాజాగా తేజ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ తో కలిసి సీత సినిమా చేసాడు. సీత సినిమా ఏప్రిల్ 25 న విడుదల కాబోతుంది.

టైగర్ నాగేశ్వర్ రావు జీవిత చరిత్ర ఆధారంగా వంశీకృష్ణ డైరెక్షన్ లో మరో సినిమా మొదలెట్టబోతున్న బెల్లంకొండ ఈసారి RX 100 బ్యూటీ పాయల్ రాజపుట్ తో ఆడిపాడనున్నాడు. RX 100 లో నెగెటివ్ షేడ్స్ తో ఇరగదీసిన పాయల్.. బెల్లంకొండ సరసన పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. ఇక తాజాగా మరో భామని కూడా బెల్లంకొండ టైగర్ నాగేశ్వర్ రావు కోసం తీసుకోబోతున్నాడట. సవ్యసాచి, మిస్టర్ మజ్ను సినిమాల ప్లాప్స్ తో ఉన్నప్పటికీ.. వరస అవకాశాలు అందుకుంటున్న నిధి అగర్వాల్ ని కూడా బెల్లంకొండ సినిమా కోసమా దర్శకనిర్మాతలు సెకండ్ హీరోయిన్ గా ఫైనల్ చేసినల్టుగా సమాచారం.

సవ్యసాచి, మిస్టర్ మజ్ను సినిమాల తర్వాత రామ్ సరసన పూరి డైరెక్షన్ లో ఇస్మాట్ శంకర్ లో నటిస్తుంది నిధి. ఇప్పుడు తాజాగా బెల్లంకొండ సరసన కూడా నిధి అగర్వాల్ నటించబోతుంది. ఎంతగా ప్లాప్స్ ఉన్నప్పటికీ.. నిధి లక్కు మాములుగా లేదు. ఎందుకంటే ఎప్పుడూ డబ్బు గురించి ఆలోచించకుండా భారీగా సినిమాలు చేసే హీరో పక్కన మూడు సినిమాలకే నిధి ఛాన్స్ దక్కించుకుంది. ఏది ఏమైనా ఈసారి బెల్లంకొండ మాత్రం చిన్న హీరోయిన్స్ తోనే సరిపెటేస్తున్నాడన్నమాట.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*