కథ బావుంటే.. వెబ్ సీరీస్ అయితే ఏంటి!!

sai dharm tej movie with maruthi

కరోనా లేకపోతె ఈపాటికి సోలో బ్రతుకే సో బెటరు అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేసేవాడే సాయి ధరమ్ తేజ్. ప్రతి రోజు పండగే తర్వాత సోలో బ్రతుకే సో బెటరు సినిమా చేసిన  సాయి ధరమ్ తేజ్ ఫ్రెండ్ షిప్ డే ముచ్చట్లు మీకోసం. సీనియర్ నరేష్ కొడుకు సాయి ధరమ్ తేజ్ కి బేస్ ఫ్రెండ్ అని చెబుతున్నాడు. ఇంటర్ చదివే రోజుల్ నుండి నూలుగురైదుగురు బెస్ట్ ఫ్రెండ్స్ ఉండేవారని.. ఇప్పటికి ఆ ఫ్రెండ్ షిప్ అలాగే కొనసాగుతుంది అని చెబుతున్న సాయి ధరమ్ తేజ్. కాలేజ్ రోజుల్లో తన ఫ్రెండ్ తాను ఒకే అమ్మాయితో పరిచయం పెంచుకుని ఒకరికి తెలియకుండా మరొకరు ఆ అమ్మాయిని ప్రేమించామని.. కానీ కొన్నాళ్ళకి ఆ అమ్మాయి తమని వదిలి దూరంగా వెళ్లిపోవడంతో ఇద్దరం బాధపడుతుంటే.. నువ్వెందుకు బాధపడుతున్నావ్ అంటే నువ్వెందుకు బాధపడుతున్నావ్ అని అడిగి.. ఇద్దరం ఒకరికి తెలియకుండా మరొకరు ఒకే అమ్మాయిని పేమించామని పోట్లాడుకున్నాం.. కానీ తర్వాత మా స్నేహం మరింతగా పెరిగింది అని చెబుతున్నాడు సాయి ధరమ్ తేజ.

ఇక వెబ్ సీరీస్ లో అవకాశం వస్తే నటిస్తారా అని దిగితే.. అందులో నటించాలి, ఇందులో నటించాలి అనేది ఏం లేదని.. కథ బావుంటే వెబ్ సీరీస్ అయినా  చేస్తానని.. నాకు కథే ముఖ్యం.. నేను చేసిన కథతో ప్రేక్షకులు తృప్తిగా ఉన్నారా లేదా…… అనేది మాత్రమే నాకు కావాలని చెబుతున్నాడు సాయి ధరమ్ తేజ్. ఇక మీ తమ్ముడు వైష్ణవ తేజ్ సినిమా ఉప్పెన సినిమా విడుదలకు ముందు కరోనా లాక్ డౌన్ వచ్చింది విడుదల ఆలస్యం అయ్యింది అని మీ తమ్ముడు ఫీలవుతున్నాడా అని అడిగితె వైష్ణవ తేజ్ చాలా బలంగా ఉంటాడు. మరో రిలీజ్ డేట్ వస్తుంది కదా అంటాడు. అసలు అన్నా మనిద్దరం నటించిన  మొదటి సినిమాలు రెండు ఇలా ఆలస్యం అయ్యాయి అని ఈమధ్యనే నవ్వుకున్నాం. ఇక సోలో బ్రతుకే సో బెటరు సినిమా మరో వారం షూటింగ్ చేస్తే ఫినిష్ అవుతుంది అని సెప్టెంబర్ నుండి షూటింగ్స్ కి వెళ్లే ఛాన్స్ ఉందని చెబుతున్నాడు సాయి ధరమ్ తేజ్. 

Ravi Batchali
About Ravi Batchali 29224 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*