చాలా తక్కువ రేట్ కి అమ్మారు

నయనతార

సాహో లాంటి భారీ చిత్రం తరువాత మన టాలీవుడ్ నుండి సైరా వస్తుంది. దాదాపు 250 కోట్లు ఖర్చు తో రూపొందిన ఈమూవీ అక్టోబర్ 2 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. మెగాస్టార్ చిరంజీవి కి మంచి మార్కెట్ ఉంది కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఈమూవీని సాహోకి సమానంగా విక్రయిస్తున్నారు. ఇక ఓవర్సీస్ లో ఈచిత్రాన్ని అనుకున్న దానికంటే చాలా తక్కువకి అమ్మారు మేకర్స్.

ఇక కాసుల పంటే….

ఓవర్సీస్‌ రైట్స్‌ కేవలం పద్ధెనిమిది కోట్లకే అమ్మేశారు. అమెరికా లో ఈ చిత్రం చాలా చోట్ల రికవరీ అయ్యే అవకాశముంది. ఒకవేళ యావరేజ్ టాక్ వచ్చినా కానీ అది రికవర్‌ చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఇక సూపర్ హిట్ అని టాక్ వస్తే అక్కడ ఈ చిత్రం ను కొన్న డిస్ట్రిబ్యూటర్ కి కాసుల పంటే. ఒకవేళ సినిమా అంచనాలని అందుకోవడంలో విఫలమయినా కానీ ఈ రేట్‌ వల్ల రిస్క్‌ ఫ్యాక్టర్‌ తగ్గుతుంది.

అమెరికాలో సైరా తక్కువరేటు….

సాహో చిత్రాన్ని చాలా ఎక్కువకి అమ్మడంతో అక్కడ సాహో చిత్రానికి అన్ని వెర్షన్లకీ కలిపి నార్త్‌ అమెరికాలో మూడు మిలియన్లు వచ్చినా అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ కి దాదాపు రెండు మిలియన్ల మేర నష్టమొస్తున్నట్టు ట్రేడ్‌ సర్కిల్స్‌ అంచనా వేస్తున్నాయి. అందుకే సైరా ఒక అడుగు ముందుకు ఆలోచించి అమెరికాలో తక్కువ రేట్ కి అమ్మారు.

 

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*