సైరా కష్టమే అంటున్నారు

సైరా

సైరా చిత్రం తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ పరంగా పర్లేదు అనిపించుకుంది కానీ ఓవర్సీస్ లో ఈ సినిమా పరిస్థితి చూస్తుంటే మాత్రం అంత ఆశాజనకంగా లేదు. అక్టోబర్ 2 న రిలీజ్ అయిన ఈ మూవీ నిన్నటి తో 5 రోజులు పూర్తి చేసుకుంది. నిన్నటితో ఈమూవీ 2 మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరింది. అది కూడా ప్రీమియర్స్ తో కలుపుకొని. మరో మిలియన్ అంటే 3 మిలియన్స్ డాలర్ క్లబ్ లోకి చేరుతుందా చేరదా అనేది ఆసక్తికరంగా మారింది. వీకెండ్ నిన్నటి తో ముగిసింది.

రెండురోజుల్లో తేలుతుంది….

ఇక ఈ రోజు నుంచి ఈ సినిమా నిలదొక్కుకుంటుందా లేక వసూళ్లు మరింతగా తగ్గుతాయా అనే విషయం మరో రెండు రోజుల్లో తెలిసిపోనుంది. పైగా అక్కడ వార్ సినిమాతో పాటు జోకర్ సినిమా కూడా ప్రేక్షక ఆదరణ పొందింది. దాంతో ఆ రెండు సినిమాల ఎఫెక్ట్ సైరా పై పడింది. సైరాకి మరో మైనస్ ఏంటంటే కొన్ని అవాంఛనీయ ఘటనల వల్ల టొరంటో, కెనడాలోని కొన్ని మల్టీప్లెక్సుల్లో ఈ సినిమా ప్రదర్శన నిలిపివేయడం జరిగింది. ఇది సైరాకు పెద్ద దెబ్బ. చిరు తన గత చిత్రం ఖైదీ నంబర్ 150ను కూడా సైరా క్రాస్ చేసేందుకు కష్టంగా ఉంది. ఓవర్సీస్ లో అత్యథిక వసూళ్లు సాధించిన సినిమా లిస్ట్ ప్రకారం చూస్తే సైరా కంటే ముందు నాన్నకు ప్రేమతో, అజ్ఞాతవాసి, ఫిదా, ఎఫ్-2, అరవింద సమేత ఉన్నాయి. మరి వాటిని సైరా ఎప్పటికి దాటేను ?

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*