విజయ్ కి ఎక్కువా.. లేక సుదీప్ కా

నయనతార

రేపు విడుదల కాబోతున్న సైరా నరసింహారెడ్డి సినిమాలో పలు భాషా నటీనటులు నటించారు. అందులో తమిళనాట కీలకమైన విజయ్ సేతుపతి, కన్నడలో కీలకమైన కిచ్చ సుదీప్, అలాగే బాలీవుడ్ నుంచి అమితాబచ్చన్ నటించారు. వీరంతా ఆయా భాషల్లో ఫెమస్ ఉన్న నటులు. అయితే సైరా సినిమాలో చిరంజీవి మెయిన్ హీరో. చిరుకి గురువు అమితాబ్. మరి మిగతా నటుల్లో కిచ్చ సుదీప్, విజయ్ సేతుపతిలకు ఈ సినిమాలో లెన్త్ ఉన్న పాత్రలిచ్చారు. అయితే ఆ పాత్రల్లో కిచ్చ సుదీప్ పాత్ర పరిధి, ప్రాముఖ్యత ఎక్కువా, లేదంటే విజయ్ సేతుపతి పాత్ర పరిధి ప్రాముఖ్యత ఎక్కువా అంటూ వారిద్దరి అభిమానులు సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు.

కనెక్ట్ అవుతున్నారు……

ఇప్పటికే విజయ్ సేతుపతి పాత్రకి ఇటు తెలుగు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. అయితే తాజా సమాచారం ప్రకారం మిగిలిన కేరెక్టర్ ఆర్టిస్ట్ ల కన్నా ఎక్కువగా సుదీప్‌కి ప్రాముఖ్యత నిచ్చినట్టుగా సమాచారం. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కాబోతున్న సైరా సినిమాకి తెలుగు, హిందీ మర్కెట్స్ ఎంత ముఖ్యమో… కన్నడ మార్కెట్ కూడా అంతే ముఖ్యం. తెలుగు సినిమాలకు కన్నడలో మంచి ఆదరణ ఉండటంతో.. కిచ్చ సుదీప్ కి సైరా సినిమాలో ఎక్కువ ప్రాధాన్యత ఉన్న పాత్ర ఇచ్చినట్టుగా తెలుస్తుంది.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*