సమంత ప్రయత్నం ఫలిస్తుందిలే

samantha telugudesamparty

ప్రస్తుతం సమంత పెళ్లి చేసుకున్నాక కూడా టాప్ హీరోయిన్ గానే తన స్థానాన్ని పదిలం చేసుకుంటుంది. ఆమె నటించిన రంగస్థలం సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికి తెలిసిందే. ఆ సినిమాలో రామలక్ష్మిలా సమంత నటన ఎంత అద్భుతంగా ఉందొ కూడా తెలిసిందే. చిలిపి పిల్లలా.. పెంకి ఘటంలా సమంత పెట్టిన ఎక్సప్రెషన్స్ చాలా బావున్నాయని అందరూ ముక్త ఖంఠంగా చెబుతున్న మాట. పల్లెటూరి అమ్మాయి గెటప్ లో డి గ్లామరస్ గా సమంత పోలంపనులు చేస్తూ గేదెలను కడుగుతూ… చూడముచ్చటైన అమ్మాయిలా అదరగొట్టేసింది. రంగస్థలం సినిమాలో రామ చరణ్ కి 100 మార్కులు పడితే… రామలక్ష్మి కి కొద్దిగా తేడాతో 90 మార్కులు పడ్డాయి.

ఎలాంటి పాత్ర అయినా సమంత అలవోకగా నాటించెయ్యగలదని అందరూ ఈ రంగస్థలం తో ఫిక్స్ కూడా అయ్యారు. అయితే పెళ్లి తర్వాత రంగస్థలంతో అదరగొట్టే హిట్ అందుకుంటే… మళ్ళీ మహానటితో కూడా మరో హిట్ కొట్టాలని చూస్తుంది. కీర్తి సురేష్ మెయిన్ పాత్ర మహానటిలో చేస్తున్నప్పటికీ… సమంత కూడా ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తుంది. అయితే సమంత ఈ పాత్రకు మొదటిసారి తన గొంతు సవరిస్తుందట. ఎప్పుడూ తన పాత్రకి సింగర్ చిన్మయి డబ్బింగ్ మీద ఆధారపడిన సమంత మహానటి కోసం తనకి తానే డబ్బింగ్ చెప్పుకుంటుంది. మహానటి ద్వారా సమంత లోని తన మరో కోణాన్ని ఆవిష్కరించబోతుందన్నమాట.

సమంత తెలుగులో ఎంతో స్వీట్ గా మట్లాడినప్పటికీ తన పాత్రకి తన డబ్బింగ్ మాత్రం ఎప్పుడూ చెప్పుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం తన స్వీటెస్ట్ గొంతుని మహానటి కోసం సవరిస్తుంది. మరి ఇప్పుడు ఈ విషయం లో కూడా సక్సెస్ అవుతుంది అంటున్నారు. ఇకపోతే మహానటి సినిమా మే 9 న విడుదలకాబోతుంది

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*