చీరకట్టుకుని ఎవరైనా బీచ్ కి వెళతారా?

Oh Baby ఓ బేబీ సమంత

అక్కినేని ఇంటి కోడలు సమంత ఇప్పుడు టాప్ పొజిషన్ లో ఉంది. రంగస్థలం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సమంత మరో రెండు హిట్స్ కొట్టెయ్యాలనే కసితో ఉంది. మహానటి, అభిమన్యుడు సినిమా ల్తో హిట్ కొట్టి తనకి తిరుగులేదని నిరూపించాలనుకుంటుంది. అలా ఎందుకనుకుంటుంది అంటే.. తెలుగులో హీరోయిన్స్ గా చేస్తూ పెళ్లి చేసుకుంటే గనక వారికీ ఇక సినిమాల్లో క్రేజే ఉండదు. అదే బాలీవుడ్ లో అయితే పెళ్లి తర్వాత కూడా మంచి డిమాండ్ ఉంటుంది. కానీ టాలీవుడ్, కోలీవుడ్స్ లో అలా కాదు. అందుకే సౌత్ హీరోయిన్స్ పెళ్లి విషయమై దీర్ఘాలోచనలో ఉంటారు. పెళ్లీడు దాటిపోయినా పెళ్లి గురించిన ఆలోచనలు చెయ్యరు.

కానీ సమంత మాత్రం అందరికి భిన్నంగా పెళ్లి వయసు రాగానే తాను ప్రేమించిన నాగ చైతన్య ని పెళ్లాడింది. అయితే పెళ్లయ్యాక కూడా ఒక పక్క సినిమాలు, హాట్ ఫొటోస్ తో సమంత నిత్యం హల్చల్ చేస్తూనే ఉంది. అయితే పెళ్లయ్యాక కూడా బికినీలు వెయ్యడం ఏమిటి? అలాగే రంగస్థలంలో రామ్ చరణ్ కి పెట్టినట్టుగా లిప్ లాక్ పెట్టడమేమిటి అంటూ నెటిజెన్ల సమంత పై అప్పుడప్పుడు విరుచుకు పడుతూనే వున్నారు. అయితే నెటిజెన్ల కామెంట్స్ కి స్పందించిన సమంత స్విమ్ షూట్స్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తే అభిమానులు నన్ను ట్రాల్ చేస్తారనితెలుసు. మరి బీచ్ కి వెళ్ళినప్పుడు స్విమ్ సూట్ లో వెళ్లకుండా చీరకట్టుకుని వెళితే ఏం బావుంటుంది అంటూ కౌంటర్ వేసింది.

అసలు నేను ఏం బట్టలేసుకోవాలో.. ఎలాంటి పోస్ట్ లు చెయ్యాలో మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నాకన్ని తెలుసు అంటూ ఘాటైన స్పందన తెలియజేసింది. అయితే పెళ్ళైన హీరోలు ఎలాంటి పనులు చేసిన రియాక్ట్ కానీ వారు… హీరోయిన్స్ పెళ్లైయ్యాక పద్దతిగా ఉండాలంటే ఎట్లా అంటూ దిమ్మతిరిగే సమాధానం చెప్పింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*