సమంత ని ఫ్యామిలీ మ్యాన్ లో కొనసాగిస్తారా

Family Man

రీసెంట్ గా రిలీజ్ అయిన ఫ్యామిలీ మ్యాన్ 2 లో రాజి గా టెర్రరిస్ట్ పాత్రలో కనిపించి.. అదరగొట్టేసిన సమంత యాక్షన్ సన్నివేశలతోనూ శభాష్ అనిపించుకుంది. మనోజ్ భాజపేయీ తో సమానంగా తలపడిన రాజి పాత్రకి ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. అయితే ఈ సీజన్ లో రాజి పాత్రని చంపేసింది రాజ్ అండ్ డీకే ద్వయం. రాజి పాత్రని ఫ్యామిలీ మ్యాన్ 2 లో ముగించేశారు. అయితే ఫ్యామిలీ మ్యాన్ 2 లో చనిపోయిఅన్ రాజి పాత్ర ఫ్యామిలీ మ్యాన్ 3 లో కొనసాగింపు ఉంటుంది అంటున్నారు. రాజి పాత్ర కల్పిత పాత్ర అయినప్పటికీ రాజి గతం తాలూకు సన్నివేశాలను పార్ట్ 3 లో చూపించబోతున్నారట.
అసలు రాజి కేరెక్టర్ ఎక్కడ పుట్టింది, ఆమె గతం గురించి అన్ని ఫ్యామిలీ మ్యాన్ 3 లో చూపించబోతున్నారట. అయితే రాజి పాత్ర కొనసాగింపుని వెబ్ సీరీస్ లా కాకూండా సినిమా రూపంలో తియ్యబోతున్నారనేది లేటెస్ట్ న్యూస్. ఫ్యామిలీ మ్యాన్ 2 స్క్రిప్ట్ ని సమంత కి వినిపించినప్పుడే ఈ సినిమా ప్రపోజల్ గురించి సమంత తో మాట్లాడారని.. సమంత కూడా ఒప్పుకుంది అని, సో ఫ్యామిలీ మ్యాన్ 2 కొనసాగింపుగా పార్ట్ 3  ని సినిమాగా తెరకెక్కించబోతున్నారని సమాచారం.

Ravi Batchali
About Ravi Batchali 39141 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*