ఈసారి స్టార్ హీరోని పట్టిందా?
ఆలా మొదలైంది హిట్ కొట్టినా.. మధ్యలో జబర్దస్త్ తో ప్లాప్ అందుకుంది నందిని రెడ్డి… ఇక కల్యాణ వైభోగమే లంతో యావరేజ్ చిత్రంతో భారీ గ్యాప్ తీసుకుని [more]
ఆలా మొదలైంది హిట్ కొట్టినా.. మధ్యలో జబర్దస్త్ తో ప్లాప్ అందుకుంది నందిని రెడ్డి… ఇక కల్యాణ వైభోగమే లంతో యావరేజ్ చిత్రంతో భారీ గ్యాప్ తీసుకుని [more]
ఆలా మొదలైంది హిట్ కొట్టినా.. మధ్యలో జబర్దస్త్ తో ప్లాప్ అందుకుంది నందిని రెడ్డి… ఇక కల్యాణ వైభోగమే లంతో యావరేజ్ చిత్రంతో భారీ గ్యాప్ తీసుకుని మంచి కథని ఓ స్టార్ హీరో కోసం ప్రిపేర్ చేసుకుంది ఈ దర్శకురాలు. కానీ నందిని రెడ్డి ని నమ్మి స్టార్ హీరోలెవరు ఆమెకి డేట్స్ ఇవ్వలేదు. కానీ సమంత మాత్రం నందిని రెడ్డి మీద నమ్మకంతో కొరియన్ మూవీ మిస్ గ్రానీ రీమేక్ ని ఆమె చేతిలో పెట్టింది. మిస్ గ్రానీ సినిమాని చెడగొట్టకుండా సమంత హీరోయిన్ గా నందిని రెడ్డి ఓ బేబీ గా రీమేక్ చేసి హిట్ కొట్టింది. ఈ హిట్ తో నందిని రెడ్డి జాతకం మారిపోవడం ఖాయమే. ఎందుకంటే సమంత నటనతో ఎన్ని మార్కులు కొట్టేసిందో… నందిని రెడ్డి డైరెక్షన్ కి అంతే మంచి మార్కులు పడుతున్నాయి.
అయితే మిస్ గ్రానీని రీమేక్ చేసే ముందే నందిని రెడ్డి రెడీ చేసుకున్న స్క్రిప్ట్ ని ఇప్పుడు స్టార్ హీరోలకి వినిపించి తనకొచ్చిన క్రేజ్ తో సినిమాని ని ఓకె చేయించుకునే పనిలో పడినట్లుగా ఫిలింనగర్ టాక్. ఓ బేబీ మొదటి రోజు వసూళ్లు భేషుగ్గా ఉండడంతో శని ఆదివారాలు కూడా బుకింగ్స్ అదిరిపోతున్నాయి. అయితే ఈ సినిమా హిట్ తో నందిని చెప్పే కథ ఏ హీరో అయినా ఓకె చేస్తే ఈసారికి నందిని పంట పండినట్లే. ఓ బేబీ హిట్ తర్వాత నందిని రెడ్డి నెక్స్ట్ సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది. మరి నందిని చెయ్యబోయే ఆ నెక్స్ట్ సినిమాకి ఏ హీరో దొరుకుతాడో అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.