పారితోషకం వద్దంది కానీ… వాటా కావాలంట

సమంత ఇప్పుడు ‘రంగస్థలం’ హిట్ తో ఫుల్ ఖుషీగా ఉంది. అలాగే ‘మహానటి’ సినిమా విడుదల కోసం వేచి చూస్తుంది. మరి ‘మహానటి’ సినిమాలోనూ సమంత పాత్రకి మంచి ప్రాధాన్యతే ఉన్నట్టుగా వుంది… ‘మహానటి’ ప్రమోషన్స్ చూస్తుంటే. ఎందుకంటే మధురవాణిగా జర్నలిస్ట్ పాత్ర చేస్తున్న సమంత మీదే ‘మహానటి’ ప్రమోషన్స్ ఉన్నాయి. సమంత, విజయ్ దేవరకొండ క్రేజ్ ని క్యాష్ చేసుకోవడానికి ‘మహానటి’ టీమ్ చాలానే ప్లాన్స్ చేస్తుంది. మరి ‘మహానటి’ కూడా హిట్ అయితే సమంత కి మరింత క్రేజ్ పెరగడం ఖాయం. ఇక ప్రస్తుతం సమంత తనకి ఎంతో ఇష్టమైన కన్నడ మూవీ రీమేక్ చేస్తుంది. కన్నడలో సూపర్ హిట్ అయిన ‘యు -టర్న్’ మూవీ ని తెలుగులో సమంత హీరోయిన్ గా మెయిన్ లీడ్ లో రీమేక్ చేస్తుంది. మరి ఈ సినిమాని తెలుగులోకి రీమేక్ చేసే ప్రయత్నంలో సమంత భర్త తో కలిసి వెళ్లిమరీ ‘యు – టర్న్’ హక్కులు తెచ్చుకుంది.

ఈ సినిమాలో జర్నిలిస్ట్ గా నటిస్తున్న సమంత… ఈ సినిమా కోసం నయా పైసా తీసుకోవడం లేదట. వైవిధ్యభరితమైన సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా మాతృక దర్శకుడే తెలుగు, తమిళ భాషల కు కూడా డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ సినిమా ఓ మాదిరి బడ్జెట్, అంటే లో బడ్జెట్ తో రూపొందిస్తుండటం వలన….. ఈ సినిమాకి సమంత పారితోషికం తీసుకోవడం లేదట. పారితోషకం వద్దంది కానీ సినిమా హిట్ అయితే వచ్చే లాభాల్లో వాటా కావాలని సమంత అడిగినట్టుగా చెబుతున్నారు. అయితే సినిమా తనకి బాగా నచ్చింది.. అలాగే ప్రేక్షకులకు కూడా బాగా కనెక్ట్ అయ్యి హిట్ అవుతుందనే నమ్మకంతోనే సమంత ఇలా తన కి లాభాల్లో వాటా ఇమ్మని అడిగిందనే టాక్ వినబడుతుంది. అయితే సమంత అస్సలు పారితోషకం తీసుకోకుండా ఇలా లాభాల్లో వాటా అంటూ చేస్తున్న మొదటి సినిమా ‘యు – టర్న్’ కావడం విశేషం

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*