జిమ్ లో బిజీ బిజీ

సమంతా

అక్కినేని వారి కోడలు, హాట్ హీరోయిన్ సమంత కి తెలుగులో పెద్దగా సినిమాలేవీ లేవు. ఆమె చేస్తున్న 96 రీమేక్ కూడా ఈ మధ్యనే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇక సమంత ద ఫామిలీ మన్ వెబ్ సీరీస్ లో కూడా నటిస్తుంది. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు లేని సమంత జిమ్ లో మాత్రం తెగ వర్కౌట్స్ చేస్తూ బిజీ గా గడుపుతుంది. ఎప్పుడూ ఫిట్నెస్ మీద కాన్సన్ ట్రేషన్ పెట్టే సమంత నిరంతరం జిమ్ లో డిఫ్రెంట్ డిఫ్రెంట్ గా వర్కౌట్స్ చేస్తుంటుంది. ఇక సమంత జిమ్ లో కష్టపడే వీడియోస్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం.

యాక్షన్ సీన్స్

మరి హాట్ అండ్ స్పైసి సమంత ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ లో విలన్ గా నెగెటివ్ రోల్లో యాక్షన్ సీన్స్ లో కనిపించబోతుందనే న్యూస్ ఉంది. మరి ఎప్పుడూ హాట్ హాట్ గా గ్లామర్ గా ఉండే సమంత ఈ మధ్యన నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో అదరగొట్టేస్తుంది. ఇక ఇప్పుడు నెగెటివ్ రోల్ లోను తన సత్తా చాటబోతుంది. స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు లేకపోతేనేమి ఈ అమ్మడు మాత్రం ఎప్పుడు బిజినే.

 

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*