జబర్దస్త్ లో ఆ టీం లీడర్ పోస్ట్ ఊస్టింగా?

Satti Pandu

ఎక్స్ట్రా జబర్దస్త్ లో చమ్మక్ చంద్ర స్కిట్ కి విశేష అభిమాన గణం ఉంటుంది. చంద్ర స్కిట్ లో సత్తిబాబు తో చంద్ర ఆడుకునే ప్రతి డైలాగ్ బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తారు. అయితే చమ్మ చంద్ర ఇప్పుడు జబర్డ్స్ ని వదిలి నాగబాబు తో పాటుగా అదిరింది ప్రోగ్రాం కి వెళ్ళిపోయాడు. నాగబాబు మీద గౌరవంతో పారితోషకం డబుల్ కావడంతో చంద్ర అదిరింది కి వెళ్లి కామెడి చేసుకుంటున్నాడు . కానీ సత్తిపండి మాత్రం చంద్ర తో వెళ్లకుండా జబరదాస్ లోనే ఉండిపోయాడు. దానితో సత్తిపండు ని టీం లీడర్ గా చేసారు మల్లెమాల యాజమాన్యం. చంద్ర టీంలోనే చేస్తున్న సత్తిపండుతో పాటు ఆనంద్‌ను కలిపి టీం లీడర్స్‌ను చేసారు. ఈ టీంకు సరదా సత్తిపండు, అదుర్స్ ఆనంద్ అని పేరు కూడా పెట్టారు.

అయితే తాజాగా సత్తిపండు టీం వలన పెద్దగా ఉపయోగం లేదని.. చంద్ర వెళ్ళిపోయాక సత్తిపండు టీం పెరఫార్మెన్స్ విషయంలో బాగా వెనకబడి ఉందని .. టీఆర్పీలోను బాగా వెంబడి ఉండడంతో…ఇప్పుడు ఈ టీంలో ఉన్న సత్తిపండును టీం లీడర్ నుంచి తీసేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. సత్తిపండు శాయశక్తులా ప్రయత్నిస్తున్నప్పటికీ.. సత్తిపండు స్కిట్స్ పేలడం లేదని.. కాబట్టే సత్తిపండు టీం ని తీసేస్తున్నారట. చమ్మక్ చంద్ర తో సక్సెస్ ఫుల్ గా సాగిన సత్తిపండు కెరీర్ ఇప్పడూ చంద్ర వెళ్ళాక దీనావస్థలో ఉందంటున్నారు. మరి టీం లీడర్ పదవిపోతే సత్తిపండు మరో టీం లోకి వెళ్లి కామెడి చేసుకోవాలి. లేదంటే లేదు. గతంలోనూ చాలామంది కమెడియన్స్ టీం లీడర్స్ గా సక్సెస్ కాక మరో టీం లో కామెడీ చేసుకుంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*