విజయ్ సర్కార్ కథ ఇదేనా?

కోలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న క్రేజీ కాంబినేషన్స్ లో విజయ్ – మురుగదాస్ ఒకటి. ప్రస్తుతం వీరి కాంబినేషన్ లో ‘సర్కార్’ అనే మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ గా ఈ మూవీకి సంబందించి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేసారు చిత్ర యూనిట్. ఇందులో హీరో విజయ్ అమెరికాకు చెందిన టెక్‌ ఎక్జిక్యూటివ్‌గా కనిపించనున్నాడు.

ఈ పాత్ర గూగుల్ సీఈవో సుందర్‌ పిచాయ్‌కు దగ్గర పోలికలతో ఉంటుందని ఇన్సైడ్ టాక్. ఇండియాలో జరుగుతున్న కొన్ని సంఘటనలు వల్ల విజయ్ అమెరికా నుండి చెన్నైకు వచ్చి ఇక్కడ పాలిటిక్స్ లో ఎంట్రీ ఇస్తాడంట. అయితే రీసెంట్ గా ఇటువంటి కథతోనే ‘భరత్ అనే నేను’ సినిమా తెరకేకింది.

ఇంచుమించు రెండు స్టోరీస్ ఒకేలా ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో మురుగదాస్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి. గతంలో వీరి కాంబినేషన్ లో ‘తుపాకీ’, ‘కత్తి’ లాంటి సినిమాలు వచ్చాయి. ఆ రెండు సినిమాలు కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో వీరు హాట్ ట్రిక్ కొడతారని అందరు నమ్ముతున్నారు. విజయ్ కి జోడిగా కీర్తి సురేష్ నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే వున్నాయి. ఈ ఏడాది దీపావళి కానుకగా ఈ సినిమా విడుదల కాబోతుంది

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*