శైలజ రెడ్డి అల్లుడు ఫస్ట్ డే కలెక్షన్స్!
మారుతి దర్శకత్వంలో నాగ చైతన్య - అను ఇమ్మాన్యువల్ జంటగా.. రమ్యకృష్ణ కీలకపాత్రలో నటించిన శైలజ రెడ్డి అల్లుడు నిన్న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈగో కాన్సెప్ట్ తో మారుతి ఈ సినిమాని కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాలనుకుని బోల్తా పడ్డాడు. ముగ్గురు ఈగో కేరెక్టర్స్ మధ్య నలిగిపోయే కుర్రాడిలా నాగ చైతన్య నటిస్తే.. ఒళ్లంతా ఈగో ఉన్న పాత్రల్లో రమ్యకృష్ణ, మురళి శర్మ, అను ఇమ్మాన్యువల్ నటించారు. అయితే ఈ సినిమాలో కామెడీకి పెద్ద పీట వేద్దామనుకున్న మారుతికి ఆ కామెడీనే తేడా కొట్టేసింది. మారుతి ఈ సినిమాని హ్యాండిల్ చెయ్యడంలో బాగా తడబడ్డాడు. అందుకే ఈ సినిమాకి ప్రేక్షకులు, క్రిటిక్స్ కూడా ఓవరాల్ గా యావరేజ్ టాక్ ఇచ్చారు. 25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న శైలజ రెడ్డి అల్లుడు మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు సాధించింది.
ఏరియా షేర్స్ (కోట్లలో)
నైజాం 1.65
సీడెడ్ 0.81
నెల్లూరు 0.23
కృష్ణ 0.40
గుంటూరు 0.59
వైజాగ్ 0.60
ఈస్ట్ గోదావరి 0.52
వెస్ట్ గోదావరి 0.41
ఏపీ అండ్ టీఎస్ షేర్స్ 5.21 కోట్లు