ఎంట్రీ కోసమేనా ఈ బికినీ షో

బాలీవుడ్ స్టార్ హీరోస్ కూతుళ్లు ఇప్పుడు సినిమాల ఎంట్రీ కోసం తెగ కుస్తీలు పాటు పడుతున్నారు. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీఖాన్ సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ జోరు చూపిస్తుంది. మరోపక్క శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కూడా తన మొదటి సినిమాతో వెండితెర ఎంట్రీకి సిద్ధం గా వుంది. కానీ షారుఖ్ కూతురు సుహానా ఖాన్ బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడిస్తుంది అనేది మాత్రం క్లారిటీ లేదుకానీ…. అమ్మడు మాత్రం తెగ గ్లామర్ షో చేస్తుంది. బాలీవుడ్ అంటేనే… గ్లామర్ షో. కానీ సినిమాల్లో ఎంట్రీ ఇవ్వకముందే ఇలా బికినీల రచ్చ తో కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది… అబ్బా సుహానా అందాలు అదరహో అన్నట్టుగా వున్నాయి.

మొన్నామధ్యన ఐపిల్ లో తండ్రితో కలిసి మ్యాచ్ లు చూడడానికి వచ్చిన సుహానా పై లవ్ రూమర్స్ వచ్చాయి. సుహానా యువ క్రికెటర్‌ శుబ్‌మాన్‌ గిల్‌తో ప్రేమలో పడినట్లు పుకార్లు షికార్లు చేశాయి. అలా రూమర్ రావడానికి మెయిన్ కారణం ఐపీఎల్‌ మ్యాచ్‌ల అనంతరం నైట్‌రైడర్స్‌ ఆటగాడు గిల్‌తో సుహానా ముచ్చటించడం తో ఇలాంటి రూమర్ బిటౌన్ వర్గాల నుండి బయలు దేరింది. ఇక అప్పటినుండి మీడియా గట్టి నిఘానే పెట్టింది. అయితే తాజాగా సుహానా మరోమారు బికినీ షో తో తెగ హైలెట్ అయ్యింది. తన తండ్రికి కిస్ పెడుతున్న ఫోటో తో పాటుగా బికినీ వేసుకుని తన అన్న, తమ్ముడితో కనిపిస్తున్న సుహానా ఆ బికినిలో అబ్బో.. హీరోయిన్ కుండాల్సిన లక్షణాల్ని ఈ అమ్మడు దగ్గర ఉన్నాయి.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

కానీ సుహానా ఇలా బికినీ షోతో, గ్లామర్ షో తోనూ రచ్చ రచ్చ చేస్తున్నప్పటికీ బాలీవడ్ ఎంట్రీ ఎప్పుడిస్తుందో షారుఖ్ కూడా చెప్పకుండా అందరిని సస్పెన్స్ లో పడేస్తున్నాడు. ప్రస్తుతం షారుఖ్ త‌న కుటుంబంతో క‌లిసి విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ వెకేష‌న్ లో షారుఖ్ కూతురు సుహానా త‌న స్నేహితుల‌తో క‌లిసి బికినీల‌తో ర‌చ్చ‌రచ్చ చేస్తోంది. మరి సుహానా చేసే ఈ గ్లామర్ షో బాలీవుడ్ ఎంట్రీ కోసమేనా అంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*