సూర్య సరసన టాప్ హీరోయిన్స్?

బందోబస్త్

కోలీవుడ్ లో అజిత్ ని వదిలేసి సూర్య తో సినిమా చేస్తున్న దర్శకుడు శివ.. సూర్య సినిమాని త్వరలోనే మొదలెట్టబోతున్నాడు. అజిత్ తో వరస సినిమాలు చేసిన శివ ఇప్పుడు సూర్య తో కూడా యాక్షన్ మూవీనే ప్లాన్ చేశాడు. సూర్య కూడా వరుస ప్లాప్స్ తో కొట్టుమిట్టాడుతున్నాడు. ప్రస్తుతం కప్పం తో ప్రేక్షకులముందుకు రాబోతున్న సూర్య తన తదుపరి సినిమాని యాక్షన్ డైరెక్టర్ శివ తో కమిట్ అయ్యాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ లో ఉన్న ఈ సినిమా కోసం హీరోయిన్స్ నుంచి నటీనటుల ఎంపికచేపట్టినట్లుగా తెలుస్తుంది.

నయనతార, కాజల్ పాత్రలు…

సూర్య సరసన హీరోయిన్స్ గా లేడి సూపర్ స్టార్ నయనతార పేరు పరిశీలిస్తుండగా… సెకండ్ హీరోయిన్ ప్లేస్ కి కాజల్ అగర్వాల్ పేరుని పరిశీలిస్తుందట చిత్ర బృందం. నయనతార మెయిన్ లీడ్ కాగా.. కాజల్ పాత్ర నిడివి చాలా తక్కువని సమాచారం, మరి సూర్య తో ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు జట్టుకట్టబోతున్నారంటే సినిమా మీద మంచి క్రేజ్ రావడం ఖాయం. అజిత్ కి సక్సెస్ ఇచ్చినట్టుగానే ఇప్పుడు సూర్య కి కూడా శివ సక్సెస్ ఇస్తాడని సూర్య ఫాన్స్ ఆశిస్తున్నారు.

 

 

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*