ముచ్చటగా మూడో ఆవిడ కూడా?

#rrr movie update

రాజమౌళి సినిమాలో పాత్ర అంటే చాలు ఎవ్వరైనా ఉబ్బి తబ్బిబ్బవుతారు. మరి ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు భీభత్సంగా ఉన్నాయి. ఇండియా మొత్తం రాజమౌళి #RRR గురించి తెగ ఆసక్తిగా ఎదురు చూస్తుంది. కానీ రాజమౌళి మాత్రం #RRR పై ఎలాంటి అప్ డేట్ ఇవ్వకుండా అభిమానుల సహనానికి పరిక్ష పెడుతున్నాడు. షూటింగ్ మధ్యలో లీకుల గోల. అందుకే రాజమౌళి టైట్ సెక్యూరిటీ అంటూ రోజుకో న్యూస్ సోషల్ మీడియాలో బయటికొస్తుంటే.. తాజాగా #RRR పై బయటికొచ్చినా న్యూస్ మాత్రం కాస్త ఇంట్రెస్టింగ్ గా వుంది. అయితే ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ఒలీవియా నటిస్తుంటే.. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ అలియా భట్ నటిస్తుంది.

తాజాగా #RRR లోకి మరో భామ ఎంట్రీ ఇవ్వబోతుంది. అంటే ముచ్చటగా మూడో హీరోయిన్ అన్నమాట. ఆమె ఎవరో కాదు.. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఛత్రపతి లో హీరోయిన్ గ నటించిన శ్రియ కూడా #RRR లో భాగం కాబోతుందట. అయితే ఇద్దరు హీరోలకు హీరోయిన్స్ దొరికేసారు.. ఇక శ్రియతో రాజమౌళి ఏం చెయ్యబోతున్నాడో అనుకున్నోళ్లకి సమాధానం కూడా వచ్చేసింది. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ కి జోడిగా శ్రియ ని రాజమౌళి ఎంపిక చేసినంట్లుగా తెలుస్తుంది. మరి గతంలో అజయ్ దేవగణ్ సరసన కూడా శ్రియ హీరోయిన్ గా నటించింది. ఇక ఇప్పుడు వీళ్ళ కెమిస్ట్రీ #RRR లో ఎలా చూపించబోతున్నాడో రాజమౌళి చూడాలి.

Ravi Batchali
About Ravi Batchali 41286 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*