శ్రుతి హాసన్ పెగ్గు అవతల పెట్టింది

కమల్ హాసన్ కూతురు శ్రుతి హాసన్ ఆ మధ్య తాగుడికి బానిసైందని వార్తలు వచ్చాయి. ఈ విషయం పై శ్రుతి క్లారిటీ గా చెప్పింది. లక్ష్మి మంచి నిర్వహించే ఓ షో కి గెస్ట్ గా వచ్చిన శ్రుతి తన తాగుడు గురించి చెప్పింది. “నాకు విస్కీ అంటే పిచ్చి. కాకపోతే ప్రస్తుతం దానికి బ్రేక్ ఇచ్చాను. తాగడం వల్ల నేను అనారోగ్యానికి గురయ్యానని కానీ ఈ విషయం గురించి నేను ఎవ్వరికీ చెప్పలేదని నవ్వేశారు శ్రుతి. అప్పుడు ఎక్కువ తాగడం వల్ల ట్రీట్ మెంట్ తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.

స్మోకింగ్ మాటేమిటి?

ఈ విషయాన్నీ మంచులక్ష్మీ భలే తెలివిగా అడిగింది. ఒకసారి నువ్వు నేను ఒక రెస్టారెంట్ కి వెళ్లాం. అప్పటికే నీకు విస్కీ అంటే చాలా ఇష్ట మని నాకు తెలుసు. అక్కడికి వెళ్ళినప్పుడు నువ్వు విస్కీ ఆర్డర్ చేసుకున్నావ్. కానీ ఇప్పుడు మానేసినట్టు ఉన్నావ్. అది ఎందుకో తెలుసుకోవచ్చా?” అని ఏమాత్రం మొహమాటం లేకుండా సూటిగానే ప్రశ్నించారు. అంతే కాదు శ్రుతి అప్పట్లో స్మోకింగ్ కూడా చేసేదని బాలీవుడ్ మీడియాలో అప్పట్లోనే పలు కథనాలొచ్చాయి. ప్రస్తుతం అయితే డ్రింకింగ్ మానేసినట్టు చెప్పింది కానీ స్మోకింగ్ మానేసిందో లేదో మాత్రం చెప్పలేదు.

 

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*