సిల్లీ హీరోస్ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు..!
సునీల్ - అల్లరి నరేష్ హీరోలుగా చిన్న మల్టీస్టారర్ సినిమాగా తెరకెక్కిన సిల్లీ ఫెలోస్ రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అల్లరి - సునీల్ మొదటిసారి కలిసి నటిస్తున్న ఈ సినిమాపై ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంది. కానీ ఈ ఇద్దరు కామెడీ హీరోలు ప్రస్తుతం వరుస వైఫల్యాలతో బాధపడుతున్నారు. వారు నటించిన సినిమాలు వరుసగా ఫెయిల్ అవ్వడంతో.. అల్లరి నరేష్ - సునీల్ ఇద్దరి కెరీర్ ప్రమాదంలో పడింది. మరి ఈ సిల్లీ ఫెలోస్ తో హిట్ కొట్టి మళ్లీ కెరీర్ లో నిలదొక్కుకోవాలని ఈ ఇద్దరు కామెడీ హీరోలు భావిస్తున్నారు. అయితే సిల్లీ ఫెలోస్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తుంటే ఈ సినిమాపై ట్రేడ్ లో మంచి అంచనాలున్నాయనిపిస్తుంది. సిల్లీ ఫెలోస్ రెండు తెలుగు రాష్ట్రాల బిజినెస్ వివరాలు.
ఏరియా బిజినెస్(కోట్లలో)
నైజాం 1.80
సీడెడ్ 1.00
నెల్లూరు 0.15
కృష్ణ 0.50
గుంటూరు 0.50
వైజాగ్ 0.65
ఈస్ట్ గోదావరి 0.45
వెస్ట్ గోదావరి 0.35
మొత్తం ఏపీ అండ్ టిస్ షేర్ 5.40