కొంచం ఎమోషన్స్, కొంచెం నవ్వులు

బిగ్ బాస్

నిన్న జరిగిన ఎపిసోడ్ సీజన్ మొత్తం లో ఫుల్ ఎమోషనల్. ఎందుకంటే కళ్ళ ముందు రిలేటివ్స్ ని పెట్టి అందులో ఇద్దరినే లాటరీ ద్వారా బిగ్ బాస్ లోపలికి పంపారు. దాంతో శ్రీముఖి అండ్ శివ జ్యోతి ఫుల్ ఎమోషనల్ అయ్యారు. లాటరీ ద్వారా సెలక్ట్ అయిన వితికా అన్నయ్య – రవి..మేనమామ కన్ఫెషన్ రూమ్ లో వారిని కలిశారు. ఎమోషనల్ గా ఉన్న టైములో బిగ్ బాస్ హౌస్ మేట్స్ కు సరదా టాస్క్ ఇచ్చారు.

టూ… టీం… టాస్క్స్

ఈ టాస్క్ లో మగవాళ్ళు అండ్ ఆడవాళ్ళూ సపరేట్ గా విడిపోవాలి. ఇద్దరివీ రెండు గ్రూప్స్ కింద విడగొట్టి అందులో మొదటిగా మగవాళ్ళు వారికి వారే ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకోవాలని సూచించారు. కానీ ఈ టాస్క్ లో బాబా భాస్కర్ అండ్ రాహుల్ ఎమోషనల్ అవ్వకపోవడంతో మొదటి రౌండ్ మగవాళ్ళు ఓడిపోయారు.నెక్స్ట్ ఆడవాళ్ళు పది నిమిషాల్లో రెడీ అవ్వాలని చెప్పారు. అందరూ అనుకున్న టైంకి అందంగా రెడీ అవ్వడంతో రెండో రౌండ్ వారు గెలిచారు. మూడో రౌండ్ లో భాగంగా మగ సభ్యులు బెడ్ రూముని చక్కగా సర్ది…కిచెన్ లో ఐదు ఆమ్లెట్లు వేయాలని చెప్పారు. దాంతో మగవాళ్ళు బెడ్ రూమ్ ని నీట్ గా సర్ది..ఆమ్లెట్స్ వేయడంతో ఆ రౌండ్ మగవాళ్ళు గెలిచారు. ఇక చివరి రౌండ్ లో భాగంగా ఆడవాళ్లకి జనరల్ నాలెడ్జ్ మీద పది ప్రశ్నల్లో ఆరు కరెక్ట్ గా చెప్పాలి కానీ వారు చెప్పలేకపోయారు. దాంతో చివరి రౌండ్ మగవాళ్ళు గెలిచారు. అలా ఫుల్ ఎమోషనల్ గా ఉన్న ఎపిసోడ్ ని బిగ్ బాస్ టాస్కులతో అందరిని హ్యాపీ చేశారు.

 

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*