మహేష్ ఫ్యాన్స్ ఉన్నారనే ధైర్యంతోనే..

సుధీర్ బాబు సినిమాల విషయంలో మహేష్ బాబు, ప్రొమోషన్స్ టైములో ఎక్కడో ఓ చోట చెయ్యి వేస్తాడు. ఎందుకంటే సుధీర్ బాబుకి మహేష్ బాబు బావ కాబట్టి. అయితే సుధీర్ బాబు లేటెస్ట్ మూవీ ‘నన్ను దోచుకుందువటే’ రిలీజ్ కు దగ్గరలో ఉంది. ఈ సందర్భంగా నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈసినిమాకి సుధీర్ బాబు ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్ గా మారిన తర్వాత తన సొంత బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కింది. అయితే నిన్న ఫంక్షన్ కి మహేష్ బాబు రాలేదు.

ఈవిషయం గురించి సుధీర్ బాబు నిన్న ఫంక్షన్ లో మాట్లాడుతూ..”మహేష్ కి రావడం కుదరలేదు..ప్రతిసారి ఆయనను ఇబ్బంది పెట్టడం బాగోదు కాదా!” అని చెప్పాడు. నా సినిమాలు హిట్ అయినా ప్లాప్ ఐన వాటితో సంబంధం లేకుండా మహేష్ ఫ్యాన్స్ తనను ప్ర‌మోట్ చేస్తున్నారని, వాళ్ళందరికీ థ్యాంక్స్‌ అని చెప్పాడు సుధీర్ బాబు. సువర్ స్టార్ ఫ్యాన్స్ ఉన్నారనే దైర్యంతోనే నేను ఈసినిమాను ప్రొడ్యూస్ చేసానని.. ఈసినిమా అందరికి తప్పకుండా నచ్చుతుందని చెప్పాడు.

నిర్మాతగా అమ్మ పేరు సమర్పణలో పెట్టాను… కలిసి వస్తుందని! ముందు కొంచం భయపడ్డ. ఎందుకంటే మా అమ్మ చిన్నతనం నుండే తల్లి లేకుండా పెరిగింది. ఆమె చాలా ధైర్యవంతురాలు. తన జీవితంలో ఎప్పుడు ఓటమి ఎదురుకోలేదు. ఒకవేళ ఈసినిమా రిజల్ట్ వేరే విధంగా వస్తే అమ్మ పేరు పోతుందని భయపడ్డ. కానీ ఎడిటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యాక నాకు ఈసినిమాపై పూర్తి నమ్మకం వచ్చిందని చెప్పాడు. ఇక ఈసినిమాకు సంగీతం అందించిన అజనీష్ లోక్‌నాథ్‌ ఈసినిమాను మరో లెవెల్ కు తీసుకొని వెళ్తాడని అని అన్నారు సుధీర్ బాబు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*