రంగస్థలం తరహాలోనే….?

ఎప్పుడు మోడ్రెన్ గా కాష్ట్లీగా… ఫారిన్ లొకేషన్స్ లో సినిమాలు చేసే సుకుమార్ ఒక్కసారిగా రంగస్థలం అంటూ పల్లెటూరి బ్యాగ్ద్రోప్ లో సినిమా చేసాడు. కేవలం ఐదు పాత్రలను ఎక్కువగా హైలెట్ చేస్తూ రంగస్థలం సినిమాని డైరెక్ట్ చేసిన సుకుమార్ ఆ సినిమాతో బంపర్ హిట్ కొట్టాడు. మొదటిసారిగా ఒక కమర్షిల్ హిట్ అందుకున్నాడు సుకుమార్. సుకుమార్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫిలిం గా రంగస్థలం నిలుస్తుంది అనడంలో సందేహమే లేదు. ఇక ఆ సినిమా లో పల్లెటూరి పాత్రలతో.. రామ్ చరణ్, సమంత, అనసూయ, ఆది పినిశెట్టి, జగపతి బాబు ఒదిగిపోయి నటించి మెప్పించారు.

రంగస్థలం సినిమా తర్వాత సుకుమార్ కి వన్ నేనొక్కడినే సినిమా డిజాస్టర్ ఇచ్చిన మహేష్ పిలిచి మరి అవకాశం ఇచ్చాడు. మహేష్ కి స్టోరీ లైన్ చెప్పి ఒకే చేయించుకుని.. మహేష్ తో తన మూవీ మైత్రి మూవీ మేకర్స్ లోనే ఉంటుందని అధికారిక ప్రకటన ఇప్పించి మరి రెస్ట్ తీసుకోవడానికి గాను సుకుమార్ తన ఊరికి వెళ్ళిపోయాడు. రంగస్థలం సినిమా తో బాగా అలిసిపోయిన సుకుమార్ ప్రస్తుతం తన సొంతూరులో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇక అక్కడ లోకల్ మీడియా తో మాట్లాడిన సుకుమార్ తన తదుపరి ప్రాజెక్ట్ మహేష్ తో ఉంటుందని.. అది కూడా రంగస్థలం తరహాలోనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఉండబోతున్నట్టుగా చెప్పాడు.

ఇక మహేష్ కి స్టోరీ లైన్ చెప్పగా ఓకె చేసాడని..ఇక ఆ లైన్ ని పూర్తి స్క్రిప్ట్ గా మలచాలని… త్వరలోనే స్టోరీ డవలప్మెంట్ ఉంటుందని అంటున్నాడు. మరి మహేష్ తో మరో రంగస్థలాన్ని సుకుమార్ చేయబోతున్నాడా అంటూ అప్పుడే ట్రేడ్ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ విపరీతమైన అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇక వంశి పైడిపల్లి తో తన 25 వ మూవీ ని కంప్లీట్ చేసేసి ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా సుక్కుతో సినిమా కోసం రెడీ అవ్వాలని మహేష్ అనుకుంటున్నట్లుగా సమాచారం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*