Fri May 03 2024 21:11:33 GMT+0000 (Coordinated Universal Time)
కృష్ణ అంత్యక్రియలు ఫాంహౌస్ లో ఎందుకు చేయలేదంటే?
సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు ఫాంహౌస్ లో నిర్వహించకపోవడానికి గల కారణాలను ఆయన సోదరుడు ఆదిశేషగిరిరావు వివరించారు
సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు ఫాంహౌస్ లో నిర్వహించకపోవడానికి గల కారణాలను ఆయన సోదరుడు ఆదిశేషగిరిరావు వివరించారు. కృష్ణ అంత్యక్రియలను ఫాంహౌస్ లో నిర్వహించకుండా మహాప్రస్థానంలో నిర్వహించడంపై సోషల్ మీడియాలో అనేక కామెంట్స్ వచ్చాయి. దీనిపై ఆయన సోదరుడు ఆదిశేషగిరిరావు వివరణ ఇచ్చారు. కృష్ణ సతీమణి ఇందిరాదేవికి జరిగిన అంత్యక్రియలను నిర్వహించిన చోటే కృష్ణ అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారని తెలిపారు.
మెమోరియల్ ను...
అయితే కృష్ణ మెమోరియల్ ను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామని ఆయన తెలిపారు. కృష్ణ జ్ఞాపకాలు పదిలంగా ఉండేలా ఒకే చోట ఆయన నటించిన సినిమాల వివరాలు, ఫొటోలను ఏర్పాటు చేస్తామన్నారు. ఆయన కాంస్య విగ్రహాన్ని కూడా మెమోరియల్ లో ఏర్పాటు చేయడానికి కుటుంబ సభ్యులు నిర్ణయించారని ఆయన తెలిపారు. ఆయన నటించిన 350 చిత్రాల ఫొటోలు అక్కడ ఉంచి, అభిమానులు సందర్శించుకునే వీలు కల్పించాలని భావిస్తున్నట్లు ఆదిశేషగిరి రావు తెలిపారు.
Next Story