సైరాలో మ‌రో స్టార్ హీరో..!

సైరా

రామ్ చరణ్ నిర్మాతగా సురేంద‌ర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్నాడని గత కొన్ని రోజుల నుండి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఇందులో అల్లు అర్జున్ నిజంగానే ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు సైరా టీం నుండి అందుతున్న సమాచారం. ఇక ఈ సినిమాలో ఇప్పటికే సుదీప్, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, జగపతిబాబు వంటి స్టార్ లు నటిస్తున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ నటిస్తుండడంతో ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో భారీ లెవెల్ లో రిలీజ్ అవుతుంది ఈ చిత్రం. చిరు సరసన నయనతార కథానాయికగా నటిస్తుంది. తమన్నా ఓ ఇంట్రెస్టింగ్ పాత్రలో నటించనుంది.

Telugu post telugu news

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*