సై రా సెట్ కూల్చేశారా?

సై రా నరసింహ రెడ్డి

రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ లో భారీ బడ్జెట్ తో తన తండ్రి చిరు హీరోగా ధ్రువ సినిమా ఫెమ్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా సై రా నరసింహారెడ్డి అనే చారిత్రాత్మక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. అయితే ఇప్పుడు సై రా చిత్ర బృందానికి హైదరాబాద్ రెవిన్యూ అధికారులు షాకిచ్చినట్లుగా తెలుస్తుంది. అది కూడా ఒక లాండ్ విషయంలో సై రా బృందానికి రెవిన్యూ అధికారులు చుక్కలు చూపించారనే మేటర్ హల్చల్ చేస్తుంది. ప్రస్తుతం సై రా సినిమా షూటింగ్ రామ్ చరణ్ – సుకుమార్ కాంబోలో తెరకెక్కిన రంగస్థలం సినిమా కోసం వేసిన సెట్స్ లో జరుగుతుంది.

అక్కడ సై రా నరసింహారెడ్డి కోసం ఒక ఇంటి సెట్ ని నిర్మించారు. అయితే ఆ సెట్ శేరిలింగంపల్లి రెవెన్యూ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమి కావడంతో.. అనుమతులు లేకుండా సై రా సినిమా కోసం అక్కడ సెట్ వేసి ఇంటి నిర్మాణం ఎలా చేపడతారని… సై రా నరసింహారెడ్డి కోసం వేసిన ఇంటి సెట్ ని రెవిన్యూ అధికారులు కూల్చివేశారట. ప్రభుత్వ అనుమతులు లేకుండా ప్రభుత్వ భూమిలో అలా సెట్ వేసేసి.. అక్కడి భూమిని అడ్డదారిలో సై రా యూనిట్ కొట్టేయాలని చూస్తుందని రెవిన్యూ అధికారులు ఆరోపించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. భూ కబ్జాల్లో ఇదో రకమైన కబ్జా గా వారు అభివర్ణిస్తుండడం చూస్తుంటే అక్కడెంత గొడవ జరిగిందో అర్ధమవుతుంది.

ఈ విషయమై సై రా యూనిట్ కి చాల సార్లు నోటీసు లు పంపమని వారు చెబుతున్నారు. అయితే సై రా యూనిట్ మాత్రం ఈ భూమి కోర్టు గొడవల్లో ఉంది.. మెం వేరెవారి నుండి లీజుకి తీసుకున్నామని చెబుతున్నారు. మరి ఈ గొడవ సినిమా క్రేజ్ ని ఎమన్నా దెబ్బ కొడుతుందా అనే అనుమానం లో మెగా ఫాన్స్ వర్రీ అవుతున్నారు. మరి పెద్ద పెద్ద సినిమా విషయంలో ఇలాంటి చిన్న చిన్న విషయాలు సహజమే అంటూ సైరా యూనిట్ కొట్టిపారేస్తుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*