సైరాలో అన్ని పాటలు అలానే ఉంటాయంట

సై రా నరసింహ రెడ్డి

మెగాస్టార్ చిరంజీవితో సైరా న‌ర‌సింహారెడ్డి సినిమాను డైరెక్ట్ చేస్తున్న సురేందర్ రెడ్డి ఈ సినిమాపై ఎన్నో హోప్స్ పెట్టుకున్నాడు. లేటెస్ట్ గా రిలీజ్ అయినా ఈ సినిమా టీజర్ కు ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ రావడంతో చాలా హ్యాపీ గా ఉన్నాడు డైరెక్టర్ సురేందర్ రెడ్డి. అయితే ఈసినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటికి వచ్చింది.

అది కూడా సైరా సినిమా సంగీతం గురించి. ఇందులో సాంగ్స్ చాలా తక్కువుగా ఉంటాయని టాక్. ఉన్న సాంగ్స్ కూడా పూర్తిగా జాన‌ప‌ద శైలిలో సాగుతాయ‌ని ఫిలింనగర్ సమాచారం. అయితే రాయలసీమ నేపథ్యంలో ఒక సాంగ్ ఉందని..అది పూర్తిగా ఫోక్ బీట్ తో సాగుతుంద‌ని చెబుతున్నారు. చిరు కెరీర్ లో ఈ సాంగ్ హైలైట్ అవుతుందని టీం ఆశిస్తుంది.

బాలీవుడ్ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేదీ సంగీతం అందిస్తున్నాడు. టీజర్ లో అతను ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. నేప‌థ్య సంగీతానికి చాలా స్కోప్ ఉన్న సినిమా ఇది. ఆ విషయంలో అమిత్ ఆరితేరిపోయి ఉన్నాడని అందుకే అతనిని సైరా టీం సెలెక్ట్ చేసుకుందని సమాచారం. ఈ చిత్రం ఆడియో సినిమాకే హైలైట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
అయితే ఈ సినిమా ఆడియో ఎప్పుడన్నది ఇంకా తెలియాల్సిఉంది. ఇక ఇందులో సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి ఓ పాట‌ని రాస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*