బాగా హైలెట్ అవుతున్న తమన్నా

తమన్న

బాహుబలి తర్వాత తమన్నా కెరీర్ డౌన్ అయ్యిందనే ప్రచారం జరగడం కాదు కానీ నిజంగానే తమన్నా కి సినిమాలు పెద్దగా లేవు. కానీ ఆ తర్వాత తమన్నా చేతి నిండా సినిమాల్తో బిజీ అయ్యింది. బాలీవుడ్ టాలీవుడ్ లలో సినిమాలు చేస్తున్న తమన్నా రీసెంట్ గా సై రా నరసింహారెడ్డి తో తెలుగు నుంచి తమిళ, మలయాళ, కన్నడ, హిందీ పేక్షకుల ముందుకు రాబోతుంది. సైరా సినిమాలో తమన్నా రోల్ కీలకం సంగతి ఏమో గాని… తమన్నా ప్రస్తుతం తెగ హైలెట్ అవుతుంది.

చూపు పడాల్సిందే…..

సైరా సినిమాలో మొదటి హీరోయిన్ గా ప్రయారిటీ ఉన్న రోల్ లో నటించిన నయనతార ప్రమోషన్స్ ని లైట్ తీసుకోవడం, తమన్నా సైరా ప్రమోషన్స్ లో రామ్ చరణ్, చిరులతో కలిసి హుషారుగా పాల్గొనడంతో తమన్నా అందరి దృష్టిలో పడుతుంది. సైరా సినిమాలో రాణి లుక్ తో ఇరగదీస్తున్న తమన్నా సై రా ప్రమోషన్స్ లోను కలర్ ఫుల్ డ్రెస్సులు వేసుకుని టీంతో కలిసి సందడి చేస్తూ దర్శకనిర్మాతలను ఆకర్షిస్తుంది. మరి తమన్నా సైరా ప్రమోషన్స్ చూశాక చిరు నెక్స్ట్ సినిమాకి తమన్నా ని తీసుకున్నా ఆశ్చర్య పోవక్కర్లేదనే సంకేతాలు వినబడుతున్నాయి. మరి తమన్నా గనక చిరు నెక్స్ట్ సినిమా హీరోయిన్ అయితే ఆమె పంటపండినట్లే.

 

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*